వివాదస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధం ఉన్నా లేకున్నా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటాడు. సామాజిక అంశాలపై తనదైనశైలిలో స్పందించడమే, ఎప్పటికప్పుడు సినిమాలు చేయడం తెలిసిందే. కరోనా వైరస్ కారణంగా యావత్ ప్రపంచం అల్లాడిపోతుంటే వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ప్రజలు కోరుకునే దేనినైనా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ ధరలను పెంచడానికి అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో తమకు కావాల్సిన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి మందుబాబులు డబ్బును అధికంగా ఉపయోగిస్తారని తెలిపారు. ఈ మేరకు ఆయన వరుసగా ట్వీట్లు చేసారు. ఆల్కహాల్ లేకపోవడంతో కొందరిలో పెరిగిపోతోన్న ఫ్రాస్టేషన్ స్థాయి గురించి నాయకులు ఆలోచించాలని ఆయన కోరారు. ఆల్కహాల్‌కి కరోనాకు సంబంధం లేదని వర్మ ట్వీట్ల లో పేర్కొన్నారు.