దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా ‘నగ్నం’ సినిమాతో సంచలనం సృష్టించాడు. ఈ సినిమాను ఆర్జీవీ ఆన్లైన్ ద్వారా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. ఈ సినిమాలో విషయం లేకపోయినా పోస్టర్స్ , టీజర్స్ తోనే రెచ్చగొట్టి డబ్బులు బాగా రాబట్టుకున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా తెలుగమ్మాయి శ్రీ నటించింది. తాజాగా ఈమె సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా మంది పెళ్లికి ముందు సెక్స్ కరెక్ట్ కాదంటారు. కాని తన ఉద్దేశ్యంలో పెళ్లికి ముందు సెక్స్ తప్పనిసరి అని అంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పింది. డాక్టర్ చదివిన తన ఫ్రెండ్ పెద్దలు కుదిర్చిన పెళ్లి చూసుకుందట. పెళ్లి తర్వాత మొదటి రాత్రి రోజు అతడు గే అని తేలిందట. కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమెను పెళ్లి చేసుకున్నాడట. ఒక డాక్టర్ విషయంలోనే ఇలా జరిగితే ఇది సామాన్యుల పరిస్థితి ఏంటి అని స్వీటీ ప్రశ్నిస్తుంది. అందుకే పెళ్ళికి ముందే సెక్స్ తో సహా అని విషయాలు తెలుసుకోవాలి అని చెప్పుకొచ్చింది ఈ హాట్ బ్యూటీ.