వివాదస్ప దర్శకుడు రామ్ గోపాల్ వర్మ త్వరలో మరో సంచలనానికి తెరలేపేందుకు సిద్ధం అవుతున్నాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఘటన పైన వర్మ త్వరలో సినిమాను తెరకెక్కించనున్నాడు. దిశ ఘటన పై పూర్తి సమాచారాన్ని వర్మ సేకరిస్తున్నాడు. ఇటీవల దిశ కేసులో నిందితుడైన చెన్నకేశవులు భార్యను కలిసిన వర్మ ఆమె నుంచి కొంత సమాచారం తీసుకున్నాడు. ఇక అదే విధంగా నేడు ఆయన శంషాబాద్ పోలీసులను కలుసుకున్నాడు. శంషాబాద్ ఏసీపీ ని కలిసి ఘటన జరిగిన విధానాన్ని అడిగి తెలుసుకున్నాడు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వర్మ సినిమా మేకింగ్ కోసమే ఏసీపీ ని కలిశానని.. దిశ ఘటన పై సినిమా తీసేందుకు తనకు ఎవరి అనుమతి అవసరం లేరు. దిశా తల్లిదండ్రుల అనుమతి కూడా అవసరం లేదన్నాడు వర్మ. ఏదీ ఏమైనా సినిమా తీసి తీరుతానని అంటున్నాడు. త్వరలోనే మరికొంతమందిని కూడా కలుస్తానన్నాడు వర్మ.