HomeTelugu Newsకేటీఆర్ పంచ్‌తో ఆర్జీవీ ముక్కు పంక్చర్

కేటీఆర్ పంచ్‌తో ఆర్జీవీ ముక్కు పంక్చర్

11 10
కాంట్రవర్సీలకు మారుపేరైన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లాక్ డౌన్ కారణంగా మద్యం అమ్మకాలు కూడా నిలిచిపోవటంతో తెలుగు రాష్ట్రాల్లో మందుబాబులు మందులేక అల్లాడి పోతున్నారు. ఇంట్లో బోర్ కొట్టి చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారని.. మద్యం డోర్ డెలివరీ చేయాలని కొన్నిరాష్ట్రాలు ఆలోచిస్తున్నాయని.. అలాగే సీఎంలు కేసీఆర్, జగన్ కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల పరిస్థితిని అర్ధం చేసుకుని మద్యం అంటుబాటులోకి తేవాలని కోరారు. పెద్దమనసు చేసుకోండంటూ కేసీఆర్, జగన్ తో పాటు కేటీఆర్ కు ట్వీట్ చేశారు.

ఆర్జీవీ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. రాము గారు మీరు మాట్లాడుతున్నది హెయిర్ కట్స్ గురించే కదా అంటూ కౌంటరిచ్చారు. మంత్రి కేటీఆర్ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు వర్మ. కేటీఆర్ సర్.. మీ హాస్య చతురత నాకు ఇష్టం. మీ బాక్సింగ్ పంచ్ కి నా ముక్కు ఎర్రగా వాచిపోయింది. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయి అంటూ ట్వీట్ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu