HomeTelugu Trending'దిశ' ట్రైలర్‌

‘దిశ’ ట్రైలర్‌

Disha encounter movie trailగతేడాది రాష్ట్రంలో సంచలన సృష్టించిన దిశ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న సినిమా ‘దిశ.. ఎన్‌కౌంటర్‌’‌. తాజాగా ఈ సినిమా నుంచి ‘దిశ.. ఎన్‌కౌంటర్‌’‌ నుంచి ట్రైలర్ విడుదలైంది. దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి.

ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ఈ ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ‘దిశ’ ఘటన జరిగిన నవంబర్‌ 26 తేదీనే ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ఇప్పటికే తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu