సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసిన వివాదంగానే మారుతుంది. ఎవరినో ఒకరిని సెంటర్ చేసుకుని సినిమా తీస్తాడు వర్మ. అయితే.. లాక్‌డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఫుల్ సినిమాతో బిజీ అయ్యాడు వర్మ. ఒక విధంగా వర్మ గతంలో కంటే కూడా ఇప్పుడే బాగా బిజీగా ఉన్నాడు. అయితే.. వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఆయనతో కలిసిన వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ సోషల్ మీడియా లో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై తనదైన శైలిలో స్పందించిన ఆర్జీవీ. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను.. తనపై సోషల్ మీడియాలో వస్తున్నవార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పిన వర్మ.. బహుశా ఈ వార్త అబద్ధం అయినందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారని అన్నారు. నిజం ఏమిటంటే నేను చాలా ఆరోగ్యంగా ఫిట్ గా ఉన్నానని వర్మ కౌంటర్ ఇచ్చాడు. భవిష్యత్తులో వాళ్ళ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను అని వర్మ అన్నాడు.
In the wake of malicious rumours from some media outlets like one below, just wanted to clarify to whoever concerned that I am SUPER FIT https://t.co/xajKM11Z1w pic.twitter.com/FB2Q1gaTtN
— Ram Gopal Varma (@RGVzoomin) August 9, 2020