సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘కరోనా వైరస్’ సినిమా రూపొందిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. ఈ మూవీ రెండో ట్రైలర్‌ను ఆర్జీవి బుధవారం విడుదల చేశారు. కరోనా టైమ్‌లో ఓ కుటుంబ సభ్యులు ఎలా భయపడిపోతున్నారో ఇందులో చూపించారు. ఆ కుటుంబంపై కరోనా ఎలాంటి ప్రభావం చూపిందన్నది ఇందులో చూపించారు. ఇంట్లో ఓ వ్యక్తికి కరోనా వచ్చిందేమోనని ఇంట్లోని ఇతరులు భయపడుతుండడం, లాక్‌డౌన్‌లో ఇంట్లోనే కూర్చుంటూ అందరూ అసహనానికి గురవడం వంటి సన్నివేశాలు ఆయన ఇందులో చూపించారు. సినిమాలో కుటుంబ పెద్ద ఇంట్లో వారెవ్వరినీ ఇంట్లోంచి బయటకు వెళ్లనివ్వకపోవడం వంటి సీన్లను ఇందులో కనిపించాయి. త్వరలో థియేటర్లు తెరుచుకోనున్న నేపథ్యంలో.. లాక్‌డౌన్ తర్వాత రిలీజ్ కానున్న తొలి సినిమా ఇదేనంటూ వర్మ పేర్కొన్నారు.