RGV about Game Changer:
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) ఇంకెప్పటికీ గొడవల్లో పడకుండా సైలెంట్‌గా ఉంటానని మాట ఇచ్చాడు. కానీ ఆ వర్మ కాస్త సైలెంట్‌గా ఉంటాడా? కొన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న ఆయన ఇప్పుడు మళ్లీ తన పాత టాక్‌షో ప్రారంభించాడు.
వర్మకు మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ తప్ప మిగతా హీరోలు నచ్చరు. ఈ విషయాన్ని చాలా సార్లు బహిరంగంగా చెప్పాడు కూడా. “అసలైన మెగాస్టార్ అల్లు అర్జున్” అని వ్యాఖ్యానించిన వర్మ, ‘పుష్ప 2: ది రూల్’ సినిమా విడుదల తర్వాత రోజుకో ట్వీట్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేశాడు.
కట్ చేస్తే, ఇప్పుడు వర్మ దృష్టి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మీద పడింది. ఆ సినిమా ఫేక్ కలెక్షన్స్ గురించి వర్మ సెటైర్లు వేస్తూ ట్వీట్లు చేసాడు. సైబర్ క్రైమ్ ఫిర్యాదు గురించి కూడా వర్మ వ్యంగ్యంగా మాట్లాడాడు.
“తెలుగు సినిమా రియల్ టైమ్ కలెక్షన్స్‌ను రాజమౌళి, సుకుమార్ స్ట్రాటోస్ఫియర్‌కు తీసుకెళ్లారు. కానీ GC వాళ్లు దక్షిణాదిని మోసం చేస్తున్నారు” అని వర్మ ట్వీట్ చేశాడు.
RGV మాట్లాడుతూ “GC డే 1 కలెక్షన్స్ 186 కోట్లు అయితే, పుష్ప 2 కలెక్షన్స్ 1,860 కోట్లు ఉండాలి” అంటూ వ్యంగ్యంగా చెప్పారు. “అబద్దం చెబితే కూడా నమ్మేలా ఉండాలి” అని తన శైలిలో సెటైర్ వేశాడు.
ఇంతటితో ఆగకుండా, “పుష్ప 2 చూసిన తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కాళ్ల మీద పడాలి” అని RGV మరింత రెచ్చిపోయాడు. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ గొడవల్లోనే సంతోషం పొందే వర్మ మళ్లీ ఫుల్ ఫార్మ్‌లో వచ్చేశాడు!