సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి పలు సినిమాలను నిజజీవిత కథల ఆధారంగా తీసిన విషయం తెలిసిందే. వర్మ తాజాగా మారుతి రాసిన అమృతప్రణయ గాథ అంటూ ‘మర్డర్’ సినిమాను కూడా తీస్తున్నారు. ఆయన దృష్టి ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై పడింది.
‘బ్రేకింగ్ న్యూస్… ఆర్జీవీ వరల్డ్ థియేటర్‌లో నేను తీస్తున్న నా తదుపరి సినిమాకు పవర్ స్టార్ అని పేరు పెట్టాను. ఇందులో పీకే, ఎమ్మెస్, ఎన్‌బీ, టీఎస్, ఓ రష్యన్ మహిళ, నలుగురు పిల్లలు, ఎనిమిది బర్రెలు, ఆర్జీవీ నటిస్తారు. పవర్ స్టార్ సినిమాలో ఆ పాత్రల పేర్లను అర్థం చేసుకున్న వారికి బహుమతులు మాత్రం ఇవ్వను’ అంటూ ప్రకటన
చేశారు.
దీంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఇది పవన్ కల్యాణ్ బయోపిక్ కదా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. పీకే అంటే పవన్ కల్యాణ్, ఎమ్మెస్ అంటే మెగాస్టార్, ఎన్‌బీ అంటే నాగబాబు, టీఎస్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.