HomeTelugu Trendingఆయన కాళ్లు పట్టుకోలేదు: రామ్ గోపాల్ వర్మ

ఆయన కాళ్లు పట్టుకోలేదు: రామ్ గోపాల్ వర్మ

14 1వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముంబైలోని ఒక హోటల్లో తనను కలిశాడని, అలా కలిసినప్పుడు తన కాళ్లకు నమస్కారం చేశాడని కెఏ పాల్ చేసిన ట్వీట్ ఒకటి బాగా వైరల్ అయింది. ఎప్పుడూ తాను తన గురువు దాసరి కాళ్లకు కూడ నమస్కారం చేయలేదని వర్మ చెప్పాడని పాల్ అన్నారు. దానికి సమాధానంగా వర్మ ‘ప్రభువా.. నేను పాల్ కాళ్ళు ముట్టుకోలేదు. జస్ట్ పట్టుకుని వెనక్కి లాగితే వెనక్కి పడి తల నేల కేసి కొట్టుకుని తన బుర్ర సెట్ అవుతుందని ఆశపడ్డా ..కానీ మీరు హర్ట్ అవుతారేమోనని వదిలేసా’ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. అంతేకానీ తాను ముంబైలో పాల్ ను ఎందుకు, ఏ సందర్భంలో కలిసింది మాత్రం చెప్పలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu