వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. కులాల్ని బేస్ చేసుకుని ఉండనున్న ఈ ప్రాజెక్ట్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కొందరైతే వర్మను ఫోన్ ద్వారా బెదిరిస్తున్నారట. ఈ బెదింపుల గురించి మాట్లాడిన వర్మ వాట్సాప్ గ్రూపుల వెనుక, లతివియా లాంటి పనికిమాలిన దేశాల సిమ్ కార్డుల వెనక దాక్కుని బెదిరించే కమ్మోళ్ళు,నాకు ఈగలతో సమానం. దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి. అంతేకాని దోమల్లా గీ పెట్టకండి అంటూ సంచలన ట్వీట్ చేసి కొత్త వివాదనికి తేరా లేపారు వర్మ.
నా ఫోన్ నెంబర్ ఎక్కడో పట్టుకుని,అందరికీ షేర్ చేసి, వాట్సాప్ప్ గ్రూపుల వెనక, లతివియా లాంటి పనికిమాలిన దేశాల సిమ్ కార్డుల వెనక దాక్కుని నాకు వార్నింగ్లు ఇచ్చే కమ్మోళ్ళు,నాకు ఈగలతో సమానం… దమ్ముంటే కనీసం కుక్కలై అరవండి… అంతేకాని దోమల్లా గీ పెట్టకండి #KammaRajyamLoKadapaRedlu
— Ram Gopal Varma (@RGVzoomin) June 1, 2019