HomeLatestరివ్యూ: నిర్మలా కాన్వెంట్

రివ్యూ: నిర్మలా కాన్వెంట్

నటీనటులు: రోషన్, శ్రియ శర్మా, నాగార్జున, సూర్య, ఆదిత్య మీనన్, అనితా చౌదరి తదితరులు..
సంగీతం: రోషన్ సాలూరి
ఫోటోగ్రఫి: ఎస్.వి.విశ్వేశ్వర్
ఎడిటింగ్‌: మధుసూదనరావు
కథ: కాన్సెప్ట్‌ ఫిలింస్‌
రచనా సహకారం: లిఖిత్‌ శ్రీనివాస్‌
నిర్మాతలు: నిమ్మగడ్డ ప్రసాద్‌, అక్కినేని నాగార్జున
రచన-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు
రుద్రమదేవి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన శ్రీకాంత్ తనయుడు రోషన్ మొదటిసారిగా
నిర్మలా కాన్వెంట్ సినిమా ద్వారా హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో మరో విశేషం
ఏమిటంటే రోషన్ తో పాటు నాగార్జున కూడా నటించారు. ఈ సినిమాను నాగ్ సొంత బ్యానర్ లో
నిర్మించడంతో పాటు ఆయన కూడా నటించడంతో సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. మరి
ఈ నిర్మలా కాన్వెంట్ ప్రేక్షకుల అంచనాలను అందుకోగలిగిందో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి
తెలుసుకుందాం!
కథ:
సామ్యూల్(రోషన్) చాలా తెలివైన విధ్యార్థి. డేవిడ్(సూర్య), మీరా(అనితాచౌదరి)లకు ఒక్కగానొక్క
కొడుకు. ఉన్న ఒక ఎకరం పొలంలో పని చేసుకుంటూ.. కొడుకుని చదివిస్తూ ఉంటారు. అయితే
భూపతి రాజు(ఆదిత్య మీనన్) అనే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి వారి 99 ఎకరాలకు నీటిని
అందించే డేవిడ్ పొలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఇది ఇలా ఉండగా సామ్యూల్,
భూపతి రాజు కూతురు శాంతి(శ్రియ శర్మా)ను ప్రేమిస్తూ ఉంటాడు. శాంతికి కూడా సామ్యూల్
అంటే ప్రాణం. వీరి ప్రేమ విషయం భూపతిరాజుకి తెలిసి సామ్యూల్ ను కొట్టిస్తాడు. కొడుకు ప్రేమను
దక్కించాలని డేవిడ్ ఉన్న ఒక్క ఎకరాన్ని భూపతి రాజుకి రాసిస్తాడు. కానీ భూపతి, డేవిడ్ ను
మోసం చేస్తాడు. తమ ఆస్తికి సరితూగెలా ఉన్నవాడికే తన కూతురునిచ్చి పెళ్లి చేస్తా అంటాడు.
ఆ మాటలను ఛాలెంజ్ గా తీసుకున్న సామ్యూల్ ఏం చేశాడు..? డబ్బు ఎలా సంపాదించాలనుకుంటాడు..?
సినిమాలో నాగార్జున పాత్ర ఏంటి..? అనే అంశాలతో సినిమా నడుస్తుంటుంది.
ప్లస్ పాయింట్స్:
సంగీతం
ఫోటోగ్రఫి
ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్
మైనస్ పాయింట్స్:
ఎడిటింగ్
కథ. కథనం
విశ్లేషణ:
తెలుగు సినిమాల ధోరణిలో ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. చిన్న బడ్జెట్ తో వచ్చి బ్లాక్ బాస్టర్
హిట్స్ కొట్టిన చాలా చిత్రాలను ఇటీవల చూశాం. కానీ ఇంకా కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకులను
పరీక్షించడానికే అన్నట్లు వస్తున్నాయి. నిర్మలా కాన్వెంట్ కూడా ఆ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనడంలో
సందేహమే లేదు. రెగ్యులర్ కథను తీసుకొని.. దానికి మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంను యాడ్
చేసి సినిమా చేసేశారు. టీనేజ్ లవ్ స్టోరీ అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంటుంది. థియేటర్ కు
వచ్చే వారి సంఖ్య ఎక్కువే ఉంటుంది. నిజానికి ఇలాంటి కథలను చక్క్గగా ప్రెజంట్ చేయొచ్చు.
కానీ చిత్ర దర్శకుడు మాత్రం విసుగుపుట్టేలా సినిమాను తీర్చిదిద్దాడు. ఏ వయసు ఆడియన్స్ ను
దృష్టిలో పెట్టుకొని సినిమా చేశారో.. వారిని మాత్రం సినిమా కచ్చితంగా నిరాశ పరుస్తుంది. మరి
ఇలాంటి కథను నమ్మి నాగార్జున లాంటి స్టార్ హీరో ఎలా ప్రొడ్యూస్ చేయాలనుకున్నారో.. అంతేకాదు
కథలో ఎలాంటి కంటెంట్ లేనప్పుడు ఆయన నటిస్తే మాత్రం లాభం ఏముంటుంది. సంగీతం,
ఫోటోగ్రఫి ఆకట్టుకున్నప్పటికీ కథ-కథనంలో సత్తా లేనప్పుడు మిగిలినవి ఎంత బాగున్నా..
పట్టించుకోరు. షార్ట్ ఫిల్మ్ చేయాల్సిన కథను పట్టుకొని ఫీచర్ ఫిల్మ్ చేసే ప్రయత్నంలో డైరెక్టర్
ఫెయిల్ అయ్యాడు. అక్కర్లేని సన్నివేశాలు, పాటలు విసుగుపుట్టిస్తాయి. హీరోగా రోషన్ కు
మొదటి సినిమా అయినప్పటికీ చక్కగా నటించాడు. కొన్ని హావభావాలు బానే పలికించాడు.
శ్రియా శర్మ తన గ్లామర్ షోతో ఆకట్టుకుంది. మిగిలిన పాత్రలు వారి పరిధుల్లో చక్కగా నటించారు.
సరదాగా కుటుంబంతో సినిమా చూడాలనుకునే వారు మాత్రం ఈ సినిమాకు దూరంగా ఉంటే
మంచిది.
రేటింగ్: 1.5/5

Recent Articles English

Gallery

Recent Articles Telugu