బ్యానర్: అన్నపూర్ణ స్టూడియోస్
నటీనటులు: సుమంత్, పల్లవి సుబాష్, తనికెళ్ళ భరణి, శ్రీలక్ష్మి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: షానిల్ డియో
నిర్మాత: వై.సుప్రియ. సుధీర్ పూదోట
దర్శకత్వం: మల్లిక్ రామ్
బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు, బాక్సాఫీస్ విజయం సొంతం చేసుకున్న ‘విక్కీ డోనార్’
అనే సినిమాను తెలుగులో హీరో సుమంత్ ‘నరుడా డోనరుడా’ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.
చాలా కాలం గ్యాప్ తీసుకొని సుమంత్ నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు
వచ్చింది. మరి ఈ సినిమా ఆయన ఆశించిన ఫలితాన్ని రాబట్టిందో.. లేదో.. సమీక్షలోకి వెళ్ళి
తెలుసుకుందాం!
కథ:
విక్రమ్(సుమంత్) చదువు పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటూ.. స్నేహితులతో సరదాగా ఎంజాయ్
చేస్తూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. డబ్బు సంపాదించాలని అనుకుంటాడు.. కానీ ఎలాంటి
ఉద్యోగం చేయడు. అదే సమయంలో ఆంజనేయులు(తనికెళ్ళ భరణి)అనే ఫెర్టిలిటీ సెంటర్ లో
పని చేసే డాక్టర్ ఓ స్పెర్మ్ డోనార్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఆయనకు ఓ సంధర్భంలో
విక్రమ్ ఎదురవుతాడు. విక్రమ్ ను స్పెర్మ్ డోనార్ చేయమని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ పని విక్రమ్ కు
నచ్చకపోయినా.. డబ్బు సంపాదించాలనే కోరికతో తన వీర్యాన్ని దానం చేయడానికి సిద్ధపడతాడు.
ఈ క్రమంలో విక్రమ్ కు ఆషిమా రాయ్(అల్లవి సుభాష్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి
అది పెళ్లి వరకు దారి తీస్తుంది. అయితే తనొక స్పెర్మ్ డోనార్ అనే విషయాన్ని ఆషిమాకు
తెలియనివ్వడు విక్రమ్. మరి ఆ విషయం ఆషిమాకి తెలుస్తుందా..? ఒకవేళ తెలిస్తే ఆమె
ఎలా రియాక్ట్ అవుతుంది..? విక్రమ్ స్పెర్మ్ డోనార్ గా కంటిన్యూ.. అయ్యాడా..? అనే విషయాలతో
సినిమా నడుస్తుంటుంది.
విశ్లేషణ:
స్పెర్మ్ డోనార్ అనే కాన్సెప్ట్ తెలుగుకి చాలా కొత్త కాన్సెప్ట్. అయితే తెలుగులో ఇలాంటి బోల్డ్
కథలను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారనే విషయం దర్శకనిర్మాతలు ముందుగానే ఆలోచించుకోవాలి.
జెనరేషన్ ఎంత మారినా.. ఇప్పటికీ కొన్ని విషయాలను పబ్లిక్ గా డిస్కస్ చేసే పరిస్థితిల్లో
ఎవరు లేరు. అయితే పిల్లలు కలగని భార్యాభర్తలకు సైన్స్ ద్వారా బిడ్డలను కలిగిస్తున్నారు.
ఇదే కాన్సెప్ట్ కు అవ్ స్టోరీను, ఫ్యామిలీ సెంటిమెంట్ ను జోడించి ‘నరుడా డోనారుడా’ సినిమాను
తెరకెక్కించారు. సినిమా మొదటి భాగం అంతా.. లవ్ స్టోరీ, రెండు మూడు కామెడీ సీన్స్ తో
సాగింది. సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్ తో అంశాలతో కథ నడిచింది. అయితే కథను ప్రేక్షకులకు
కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో దర్శకుడు మల్లిక్ ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. కొన్ని
సన్నివేశాలను తెరపై చూడడానికి చాలా ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ
ఆడియన్స్ మాత్రం ఈ సినిమాను చూసే అవకాశాలే లేవు. హిందీలో ఈ సినిమా మంచి హిట్
గా నిలిచింది. ఒక్కసారైనా ఈ సినిమా చూడాలనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది. కానీ తెలుగులో
మాత్రం సినిమా అంతంత మాత్రంగా ఉంది. అందులోనూ కొత్త ఆర్టిస్ట్ లు కావడంతో ప్రేక్షకులు
అక్కడక్కడా విసుగు చెందుతారు. స్పెర్మ్ డోనార్ గా సుమంత్ ఈ పాత్రకు సరిగ్గా సెట్ కాలేదనే
చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులకు పరీక్షలా ఉంటుంది. కామెడీ
సన్నివేశాల్లో కూడా ఏవరేజ్ గా నటించాడు. సెకండ్ హాఫ్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ లో బాగా
నటించాడు. ఈ సినిమాకు మెయిన్ అసెట్ తనికెళ్ళ భరణి. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు.
ఆయన నటనతో, డైలాగ్స్ తో ప్రేక్షకులను నవ్వించారు కూడా.. హీరోయిన్ పల్లవి సుభాష్ అతి
చేసినట్లుగా అనిపిస్తుంది. గ్లామర్ పరమ్గా ఓకే అనిపించింది.
ఇక టెక్నికల్ గా ఈ సినిమా చాలా వీక్ అనే చెప్పాలి. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం
బావున్నప్పటికీ పాటలన్నీ ఒకేరకంగా ఉండడంతో బోర్ కొట్టిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సో.. సో..
గా ఉంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదనిపిస్తుంది. డైలాగ్స్ బావున్నాయి. తెలుగు నేటివిటీకు
కథలో మార్పులు చేసేప్పుడు దర్శకుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బావుండేది. అతి
తక్కువ బడ్జెట్ లో సినిమాను రూపొందించారు కాబట్టి వారు ఆశించిన వసూళ్లను మాత్రం
రాబట్టగలరు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ కంటే బి,సి సెంటర్స్ ఆడియన్స్ ఈ సినిమాకు కనెక్ట్ అయ్యే
అవకాశాలు ఉన్నాయి.
రేటింగ్: 2/5