నటీనటులు: నిఖిల్ కుమార్ గౌడ, దీప్తి సతి, జగపతి బాబు, సంపత్ కుమార్, ఆదిత్యమీనన్,
రమ్యకృష్ణ, రావు రమేష్ తదితరులు.
సంగీతం: తమన్
ఫోటోగ్రఫి: మనోజ్ పరమహంస
నిర్మాత: అనితా కుమారస్వామి
దర్శకుడు: మహదేవ్
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, డిస్ట్రిబ్యూ టర్, ప్రముఖ నిర్మాత
హెచ్.డి.కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ 75 కోట్ల భారీ
బడ్జెట్‌తో, హై టెక్నికల్ వేల్యూస్‌తో శ్రీమతి అనితా కుమారస్వామి నిర్మిస్తున్న చిత్రం ‘జాగ్వార్’.
హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ పతాకంపై రాజమౌళి శిష్యుడు
ఎ.మహదేవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జాగ్వార్’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మరి ఈ చిత్ర ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
కృష్ణ(నిఖిల్ కుమార్) అనే వ్యక్తి ఓ మాస్క్ ధరించి వరుసగా ఒక్కొక్కరినీ చంపుకుంటూ అతడు
ఎవరిని చంపారో అందరికీ తెలియడానికి ఓ న్యూస్ చానెల్ ను హ్యాక్ చేసి తను మనిషిని
చంపడాన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంటాడు. అసలు ఈ హత్యలు చేస్తోంది.. ఎవరో తెలుసుకోవడానికి
ప్రభుత్వం జె.బి(జగపతిబాబు) అనే పోలీస్ ఆఫీసర్ ను నియమిస్తారు. జె.బి అలా హత్యలు
చేసే వ్యక్తికి జాగ్వార్ అని పేరు పెట్టుకుంటాడు. మీడియాలో, సొసైటిలో ఇదొక హాట్ టాపిక్
అవుతుంది. ఇలా కృష్ణ హత్య చేసే ప్రతిసారి లైవ్ టెలికాస్ట్ చేస్తూనే ఉంటాడు. చానెల్ వాళ్ళు
కూడా టి.ఆర్.పి రేటింగ్ వస్తుందని ఎలాంటి యాక్షన్ తీసుకోరు. ఆ చానెల్ ఛైర్మన్ శౌర్య ప్రసాద్,
తన స్నేహితుడితో కలిసి హాస్పిటల్ ను ఓ బిజినెస్ లా రన్ చేస్తూ ఉంటాడు. ఈలోగా కృష్ణ
మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్ గా ఎంట్రీ ఇస్తాడు. అక్కడ అన్యాయాలను ఎదిరించాలని ఫైనల్
ఇయర్ స్టూడెంట్ ఆర్య(ఆదర్శ్) ప్రయత్నిస్తుంటాడు. చివరగా ఆర్య ప్రయత్నం ఫలించిందా..?
అసలు కృష్ణ వరుస హత్యలు చేయడానికి గల కారణం ఏంటి..? ప్రత్యేకంగా శౌర్యప్రసాద్ నడిపే
చానెల్ ను, హాస్పిటల్ నే కృష్ణ టార్గెట్ చేయడానికి దారి తీసిన అంశాలేంటి..? సినిమాలో హీరోయిన్,
రమ్యకృష్ణ, రావు రమేష్ ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి..? అనే విషయాలు తెలుసుకోవాలంటే
సినిమా చూడాలి మరి!
ప్లస్ పాయింట్స్:
ఫోటోగ్రఫి
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్:
కథ, కథనం
సంగీతం
ఎడిటింగ్
విశ్లేషణ:
రెగ్యులర్ రొటీన్ కాన్సెప్ట్ ను తీసుకొని ‘జాగ్వార్’ సినిమా చేశారనడంలో సందేహం లేదు. హీరో
కుటుంబానికి అన్యాయం చేసిన వారిపై పగ తీర్చుకోవడం ఇప్పటికే ఈ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు
వచ్చేశాయి. కథ, కథనాల్లో ఎక్కడా.. కొత్తదనం కనిపించదు. పైగా దానికి తోడు తమన్ విసుగు
పుట్టించే పాటలు. మొత్తానికి సినిమాతో ప్రేక్షకులను విసుగు పుట్టించడం ఖాయం. నిఖిల్
కు ఇది మొదటి సినిమా. తనకు తెలిసినంతలో ఓకే అనిపించాడు. కానీ కొన్ని సీన్లలో అతి
చేశాడనిపిస్తుంది. సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు. జగపతిబాబు
లాంటి నటుడ్ని పెట్టుకొని ఒక్క సీన్ కూడా స్ట్రాంగ్ గా రాసుకోలేకపోయారు. విలన్ గా సంపత్,
ఆదిత్య మీనన్ లు చక్కగా నటించారు. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే రావు రమేష్, రమ్యకృష్ణల ఎపిసోడ్
రెగ్యులర్ గా ఉంటుంది. ఫోటోగ్రఫి చాలా రిచ్ గా ఉంది. ఎడిటింగ్ పై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సివుంది.
నిడివి పెరిగిపోయేసరికి ప్రేక్షకులు అసహనానికి లోనవుతారు. కథ, కథనాలకు కనెక్ట్ అయితే
ఓకే కానీ అవి లేనప్పుడు సినిమా ఎంత తక్కువ ఉంటే అంత మంచింది. తమన్నా ఐటెమ్ సాంగ్
లో బాగా నటించింది. మూస ధోరణిలో సినిమాలు రావడం తగ్గిపోతున్న ఈ తరుణంలో మరోసారి
ఈ చిత్రంతో ఆ ధోరణిని మనకు గుర్తుచేశారు. కథతో, లాజిక్స్ తో సంబంధం లేకుండా కేవలం
డాన్సులు, ఫైట్స్ కావాలనుకునే వారు మాత్రం ఈ సినిమాకు వెళ్లొచ్చు.
రేటింగ్: 2/5