Revanth Reddy Temple Bill Controversy:
తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోలెడు వివాదాల్లో చిక్కుకుంది. హైడ్రా కూల్చివేతల నుంచి అల్లు అర్జున్ అరెస్ట్ వరకు కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలతో దుమారం రేపుతోంది. తాజాగా, రేవంత్ రెడ్డి వేములవాడ సందర్శన సందర్భంగా రూ. 32 లక్షలకు పైగా విందు భోజనం ఖర్చు పెంచడం తీవ్ర చర్చనీయాంశమైంది.
నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు, ప్రభుత్వ అధికారులు కూడా వెళ్లారు. ఆలయంలో దర్శనానంతరం రేవంత్ రెడ్డి ఒక పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆ రోజు సీఎం ఇతర ప్రముఖులకు ఆతిథ్యం ఇవ్వడానికి ప్రముఖ తాజ్ గ్రూప్ సేవలందించింది.
ఆ రోజు తాజ్ గ్రూప్ స్టాఫ్ దేవస్థానం ఛైర్మన్ కార్యాలయంలో వీఐపీలకు అల్పాహారం, భోజనం ఏర్పాటు చేసింది. తాజ్ గ్రూప్ అందించిన బిల్లు రూ. 32 లక్షలు అవ్వగా, అందులో రూ. 17 లక్షలు భోజనానికి, మిగిలిన రూ. 15 లక్షలు రవాణా, సిబ్బందికి చెల్లింపులు, అలంకరణ కోసం ఖర్చు పెట్టారట. ప్రతి వీఐపీ భోజనం వ్యయం సగటున రూ. 32,000 వచ్చినట్టు సమాచారం.
అంతేకాక, ఆ రోజు వీఐపీలకు దేవస్థానం బోర్డు రూ. 10,000 విలువైన పట్టు పంచాలు బహుమతిగా ఇచ్చింది. భోజనాల కోసం వాడిన పాత్రలు, ఫర్నిచర్ మొదలైనవి కొత్తగా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. వేములవాడ ఆలయ ప్రాంగణంలో నిర్వహణ ఖర్చులు మొత్తం రూ. 1.7 కోట్ల వరకు వచ్చాయి.
తాజ్ గ్రూప్ బిల్లు దేవస్థానం కార్యనిర్వాహక అధికారికి పంపగా, ఈ బిల్లు చెల్లించడానికి ఈవో నిరాకరించారని సమాచారం. కానీ ఒక ప్రభుత్వ అధికారి నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల బిల్లు చెల్లించాలని ఆయనపై ఒత్తిడి తీసుకురావడమే కాక, ఈ వివాదం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేరింది.
ఇక విపక్షాలు, సామాజిక మాధ్యమాల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లగ్జరీ ఖర్చుల కోసం తీవ్రంగా విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.
ALSO READ: Zebra OTT కి Pushpa 2 కి మధ్య సంబంధం ఏంటంటే!