Homeతెలుగు Newsవచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కరెంట్‌ షాక్‌ తప్పదు: రేవంత్‌రెడ్డి

వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కరెంట్‌ షాక్‌ తప్పదు: రేవంత్‌రెడ్డి

కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు అధికారం ఇస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శించారు. కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ ముస్లిం మైనార్టీల సభలో రేవంత్‌ మాట్లాడారు. ఓటమి భయంతోనే కేసీఆర్‌ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని.. పోలీసులు ఇక స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని సూచించారు.

5 5

ప్రజలు 60 రోజుల సమయం తమకు ఇస్తే.. ఆ తర్వాత 60 నెలల సమయం తెలంగాణ సమాజం కోసం పనిచేస్తామని రేవంత్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఉండే ప్రధాని మోడీ జీతగాడు కేసీఆర్‌ అని ఘాటుగా విమర్శలు చేశారు. రాబోయే కాలంలో మోడీ జీతగాడు మనకు సీఎంగా ఉండాలా? అని ప్రజలను ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్‌ నెరవరుస్తుందన్నారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు కరెంట్‌ షాక్‌ తప్పదని రేవంత్‌ జోస్యం చెప్పారు. కేసీఆర్‌ సీఎం అయిన తర్వాత ఆయన కుటుంబం బాగుపడిందని ఆరోపించారు. కనీసం అమరుల కుటుంబాలను పట్టించుకోలేదని విమర్శించారు. అధికారం కోసం తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుంటున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ పాలన అంతం కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu