HomeTelugu Reviewsరిపబ్లిక్‌ రివ్యూ

రిపబ్లిక్‌ రివ్యూ

దర్శకుడు దేవ్‌ కట్టా ..మెగా మేనల్లుడు సాయితేజ్‌ కాంబినేషన్‌లో కలెక్టర్‌గా కనిపించబోతుండడంతో ‘రిపబ్లిక్‌’పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ అంచనాలను మరింత పెంచాయి. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ శుక్రవారం(అక్టోబర్‌ 1)థియేటర్ల విడుదలైంది. ఈ సినిమాలో కలెక్టర్‌గా సాయితేజ్‌ మెప్పించాడా? లేదా? రివ్యూలో చూద్దాం.

కథ: 1970లో స్వచ్ఛమైన తెల్లేరు సరస్సును రాజకీయ ప్రాబల్యం ఉన్న వ్యక్తులు కబ్జా చేస్తారు. అప్పటి నుంచి స్వచ్ఛమైన ఆ సరస్సులో విషపు ఆహారాన్ని వేస్తూ చేపలను పెంచుతారు. దాని కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. అయినప్పటికీ ఆంధ్ర ప్రజా పార్టీ అధినేత్రి విశాఖవాణి(రమ్యకృష్ణ) తన వ్యాపారాన్ని వదులుకోదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయంగా ఎదుగుతూ తన కొడుకుని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెడుతుంది. ఆ ప్రాంతానికి కలెక్టర్‌గా వచ్చిన పంజా అభిరామ్‌(సాయి తేజ్‌) తెల్లేరు సరస్సు ఆక్రమించినవారిపై చర్యలు తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న విశాఖవాణితో వైర్యం పెరుగుతోంది. ఇది ఎంతవరకు దారి తీసింది? నిజాయతీపరుడైన కలెక్టర్‌ అభిరామ్‌.. అవినీతి నాయకురాలైన విశాఖ వాణికి ఎలా బుద్ది చెప్పాడు? తదనంతర పరిణామాలు ఏమిటీ? అనేదే ‘రిపబ్లిక్‌’ కథ.

నటీనటులు: రిపబ్లిక్‌ మూవీ కోసం సాయితేజ్‌ ప్రాణంపెట్టి నటించాడు. అవినీతి పరుడైన తండ్రిని కాదని తన కాళ్లమీద తాను నిలబడే వ్యక్తిగా, నిజాయతీ గల కలెక్టర్‌ అభిరామ్‌ పాత్రలో సాయి తేజ్‌ అదరగొట్టేశాడు. ప్రాంతీయపార్టీ అధినేత్రిగా రమ్యకృష్ణ తనదైన నటనతో మెప్పించింది. ఇక అవినీతికి పాల్పడే గ్రూప్‌ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు ఎప్పటిమాదిరే పరకాయప్రవేశం చేశాడు. అద్భుత ప‌ర్‌ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తప్పిపోయిన అన్నయ్యను వెత్తుకుంటూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్‌) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్పీగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కలెక్టర్‌గా సుబ్బరాజ్‌, జగపతిబాబు భార్యగా ఆమని, తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

విశ్లేషణ: వ్య‌వ‌స్థ‌లోని లోటుపాట్ల‌ని త‌నదైన శైలిలో తెరపై చక్క‌గా చూపించాడు దర్శకుడు దేవ్‌ కట్టా. దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ని ఎక్కడా డీవియేట్‌ కాకుండా ఫెర్పెక్ట్‌గా చెప్పాడు. రాజ్యాంగానికి మూల స్థంభాలైన శాస‌న వ్యవ‌స్థ‌, అధికార వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెరపై చక్కగా చూపించాడు. డైలాగ్స్‌ కూడా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. ఫస్టాఫ్‌ కాస్త నిదానంగా సాగిన‌ట్టు అనిపించినా, హీరో కల్టెర్‌ అయినప్పటి నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. తెల్లేరు సరస్సు విషయంలో రైతుల పక్షాన ఉంటూ అభిరామ్‌ చేసే పోరాటం ఆకట్టుకుంటుంది. విశాఖ‌వాణికీ, అభిరామ్‌కీ మధ్య వచ్చే డైలాగ్స్‌, క్లైమాక్స్‌ సీన్స్‌ ఈ సినిమాకు హైలెట్‌ అని చెప్పాలి.అయితే సాధారణ ప్రేక్షకుడు కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో లేకపోవడం సినిమాకు మైనస్‌. ఈ పొలిటికల్ డ్రామాకు వాణిజ్యపరమైన మెరుగులు అద్ది ఉంటే సినిమా మరోస్థాయికి వెళ్లేది. మ‌ణిశ‌ర్మ సంగీతం పర్వాలేదు. ఇందులో మూడే పాటలున్నాయి. అవికూడా తెచ్చిపెట్టినట్లుగా కాకుండా సందర్భానుసారంగా వస్తాయి. సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది.

టైటిల్‌ : రిపబ్లిక్‌
నటీనటులు : సాయి తేజ్‌, ఐశ్యర్యా రాజేశ్‌, జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, తదితరులు

నిర్మాతలు : జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు
దర్శకత్వం:దేవ్‌ కట్టా

సంగీతం : మణిశర్మ. హైలైట్స్‌‌: సాయిధ‌ర‌మ్ తేజ్ న‌ట‌న‌
డ్రాబ్యాక్స్‌‌: నిదానంగా సాగే స‌న్నివేశాలు
చివరిగా: పొలిటికల్ డ్రామాస్ ను ఇష్టపడే వారికి ‘రిపబ్లిక్’ నచ్చుతుంది
(గమనిక: ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Recent Articles English

Gallery

Recent Articles Telugu