రేణు దేశాయ్‌కు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ ఇద్దరూ పిల్లలు పుట్టిన తరువాత విడాకులు తీసుకున్నారు. పవన్ కి రేణు దూరమైన తర్వాత పిల్లలతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
పుణే లో స్థిరపడింది రేణు దేశాయ్. అయితే కొంత కాలానికి రేణు దేశాయ్ మరో వివాహం చేసుకుంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఒంటరిగానే జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో అభిమానుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం అన్నా లెజ్నేవాని వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే తాజాగా రేణు దేశాయ్ కొద్ది సేపటి క్రితమే ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
‘మండు టెండలో చల్లని వసంత గాలిలా కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు.. వారి చూపులతోనే నేరుగా మన మనసుతో మాట్లాడతారు. అదొక మూగ భాష. మనం వారితో కొన్ని గంటలు గడిపినప్పటికీ.. వారి ప్రభావం మనపై శాశ్వతంగా ఉంటుంది.. కానీ వాటిలో చాలా వరకు బాధాకరమైనవి కూడా ఉండొచ్చు. కానీ కొందరు మాత్రమే మన జీవితాన్ని పరిపూర్ణం చేస్తారు.
మన కన్నీళ్లను తుడిచి.. కాంతిని పంచుతారు. అలాగే మనల్ని నవ్విస్తారు కూడా’ అంటూ తన మనసులోని భావాలకు అక్షర రూపమిచ్చారు రేణు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు