ఇటీవలే సినీ సెలబ్రిటీలు రక రకాల వ్యాధులతో బాధపడుతూ తెలియజేస్తూ.. షాకిస్తున్నారు. అయితే హీరోయిన్ లే అత్యధిక శాతం వివిధ వ్యాధులతో బాధపడుతుండటం గమనార్హం. ఇటీవలే మమతా మోహన్ దాస్, హంసా నందిని, సొనాలి బింద్రే బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడి విజయవంతంగా ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు.
హీరోయిన్ సమంత, సపోర్టింగ్ ఆర్టిస్ట్ కల్పిక గణేష్ మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్నామని చెప్పడం పలువురిని షాక్ కు గురిచేసింది. మయోసైటీస్ కారణంగా తాను బాధపడుతున్నానని ఆ మధ్య సోషల్ మీడియా వేదికగా వెల్లడించి భావోద్వేగానికి గురి కావడం ఆమె అభిమానులతో పాటు సెలబ్రిటీస్ ని కంటతడి పెట్టించింది. ప్రస్తుతం కోలుకున్న సమంత మళ్లీ సినిమాలతో బిజీ అయిపోయింది.
ఇదిలా వుంటే తాజాగా నటి రేణుదేశాయ్ షాకింగ్ పోస్ట్ తో సోషల్ మీడియా వేదికగా తాను కూడా గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాని వెల్లడించడం షాక్ కు గురిచేస్తోంది. గత కొన్నేళ్లుగా తను తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నానని వెల్లడించింది. తన పరిస్థితి ఏమీ బాగాలేదని స్పష్టం చేసింది. గత కొంత కాలంగా తాను పోరాడుతున్నానని తెలిపింది.
నా శ్రేయోభిలాషులందరికీ ఓ విషయాన్ని చెప్పాలని అనుకుంటున్నాను. నేను కొన్నేళ్లుగా ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నాను. ఎలాంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నానో మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను వాటిని ఎదుర్కొనేందుకు ఎంతటి శక్తిని కూడగట్టుకుంటున్నానో మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇలా ఈ విషయాలన్నీ చెప్పేందుకు ఓ కారణం వుంది. నాలా ఎవరైనా బాధపడుతుంటే వారిలో ధైర్యాన్ని నింపేందుకు పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసేందుకు చెబుతున్నాను.
మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా ధైర్యాన్ని కోల్పోవద్దు. బలంగా నిలబడాలి. ఏదో ఒక రోజు మనకు ఫలితం వస్తుంది. ఎప్పటికీ ఆశను కోల్పోవద్దు. నిరుత్సాహపడొద్దు. జీవితం మీద మన మీద మనకు నమ్మకం వుండాలి. ఈ ప్రపంచం మనకోసం ఎన్నో సర్ ప్రైజ్ లను ప్లాన్ చేసింది.
ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నవ్వుతూ వాటిని ఎదుర్కోవాలి. నాకు ఇప్పుడు చికిత్స జరుగుతోంది. మందులు వాడుతున్నాను. యోగా చేస్తున్నాను. పోషకాహారాన్ని తీసుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ మామూలు మనిషిలా తిరిగి వస్తాను. షూటింగ్ లో పాల్గొంటాను` అంటూ తెలిపింది. కానీ తనకు వచ్చిన ఆరోగ్య సమస్య ఏమిటో చెప్పలేదు.
నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇలా పలు విభాగాల్లో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది రేణూ దేశాయ్. గత కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఆమె రవితేజ పాన్ ఇండియా మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ తో టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తుంది.
https://www.instagram.com/reel/ComPPXKI7EY/?utm_source=ig_web_copy_link