HomeTelugu Trendingరేణు దేశాయ్‌ చేదు అనుభవం

రేణు దేశాయ్‌ చేదు అనుభవం

Renu Desai shocking post o

ప్రముఖ నటి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ, ఇటీవల కరోనా బాధితులకు అండగా నిలుస్తున్న రేణూ బ్యాంకింగ్‌ వ్యవహారాలపై ఒక షాకింగ్‌ విషయాన్ని ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా పోస్ట్‌ చేసింది. దీంతో సదరు బ్యాంకు ఖాతాదారులతో ఇతరులు కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది చాలా తీవ్రమైన తప్పు. మన ఖాతాలో వేరొకరు లాగిన్ అయ్యి నగదు బదిలీ చేసే అవకాశా లున్నాయంటూ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వక్తం చేశారు.

అసలు విషయం ఏమిటంటే… ఆమె ఒక ప్రైవేటు బ్యాంక్ మొబైల్ యాప్ లోకి లాగిన్ అయినప్పుడు అది వేరొకరికి ఖాతాలోకి లాగిన్ అయ్యింది. అంతేకాదు సదరు ఖాతాలోని పూర్తి వివరాలను కూడా చూడగలిగారు. దీంతో తాను షాక్‌ అయ్యాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రేణూ వివరాలను షేర్‌ చేశారు. హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసినా వారు సీరియస్‌గా తీసుకోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసుకున్న వెంటనే ఈ ఖాతా నుండి లాగ్ అవుట్ అయ్యానంటూ వివరించారు. కస్టమర్లకు ఆ బ్యాంకు ఇస్తున్న భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఆమె తన అకౌంట్‌ను సోమవారం క్లోజ్‌ చేయబోతున్నట్టు కూడా వెల్లడించారు. బ్యాంకింగ్‌ లావాదేవీలు, భద్రతాలోపాలపై విమర్శలు గుప్పిస్తూ కొంతమంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది ‘డిజిటల్ ఇండియా’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CPurN4Xhy4m/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu