HomeTelugu Big Storiesపవన్‌ కళ్యాణ్‌ ఫొటోను షేర్‌ చేసిన రేణుదేశాయ్‌

పవన్‌ కళ్యాణ్‌ ఫొటోను షేర్‌ చేసిన రేణుదేశాయ్‌

Renu Desai shared Pawan Kal
తెలుగు సినీ ప్రేక్షకులకు అందరికీ నటి రేణుదేశాయ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. జనసేన అధ్యక్షుడు, పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్‌ను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన నుంచి దూరమైన రేణు మరాఠి సినిమాల్లో ఆమె తన ప్రతిభను నిరూపించుకుంటున్నారు. పిల్లలిద్దరినీ తన వద్దనే ఉంచుకుని ఒక తల్లిగా వారి బాధ్యతలను చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తనకు వీలు ఉన్నప్పుడల్లా పూణెకు వెళ్లి తన పిల్లలతో సమయాన్ని గడుపుతుంటారు.

తాజాగా రేణు ఒక అద్భుతమైన ఫొటోను షేర్ చేశారు. పవన్ కళ్యాణ్ తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ చేసింది. కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు. రేణు షేర్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Recent Articles English

Gallery

Recent Articles Telugu