HomeTelugu Trendingతండ్రీ కూతురుల ప్రేమ: రేణుదేశాయ్‌

తండ్రీ కూతురుల ప్రేమ: రేణుదేశాయ్‌

4
పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నూతన సంవత్సరం సందర్భంగా.. తన పిల్లల్ని కలిసినట్లు తెలుస్తోంది. ఆయన తన కుమార్తె ఆద్యతో కలిసి దిగిన చక్కటి ఫొటోను నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇది తండ్రీ కుమార్తెల ప్రేమని క్యాప్షన్‌ ఇచ్చారు. ‘కొన్నిసార్లు ఆద్య చూడటానికి చాలా వరకు నాలాగా కనిపిస్తుంది. చాలా సార్లు తన నాన్నమ్మ, నాన్నకు కాపీలా ఉంటుంది (నవ్వుతున్న ఎమోజీ). నా కెమెరా ఫేవరెట్‌ పర్సన్‌ ఆద్య’ అని ఈ ఫొటోను ఉద్దేశించి రేణూ దేశాయ్‌ పోస్ట్‌ చేశారు. ఆమె ఈ ఫొటోను షేర్‌ చేసిన గంటలోనే 27 వేల మందికిపైగా లైక్‌ చేయడం విశేషం.

అకీరా తన చెల్లి ఆద్యను ఎత్తుకుని ముద్దుపెడుతున్న ఫొటోను మూడు రోజుల క్రితం రేణూ అభిమానులతో పంచుకున్నారు. వారిద్దరు కలిస్తే క్రేజీగా ఉంటుందన్నారు. 2009లో వివాహం చేసుకున్న రేణూ, పవన్‌ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2012లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయినా సరే పిల్లల కోసం మేం స్నేహితులుగా ఉన్నామని, ఒకరిపై మరొకరికి ద్వేషంలాంటివి లేవని రేణూ చాలా సందర్భాల్లో చెప్పారు. అంతేకాదు రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రేణూ గత ఏడాది ప్రకటించారు. నిశ్చితార్థం జరిగిందని ఫొటోలు షేర్‌ చేశారు. కానీ పెళ్లి గురించి ఆమె మాట్లాడలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu