HomeTelugu Newsవరుణ్ తేజ్ పెళ్లిపై రేణూదేశాయ్ స్పందన

వరుణ్ తేజ్ పెళ్లిపై రేణూదేశాయ్ స్పందన

Renu Desai 1 1
మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ పెళ్లి సంబరాలు ఆకాశన్నంటుతున్నాయి. మెగా ఇంట్లో ఈ పెళ్లి సందడి అందరినీ ఆకట్టుకుంటోంది. నిశ్చితార్థం వేడుక, బన్నీ ఇచ్చిన స్పెషల్ పార్టీల గురించి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు పెళ్లి సమయం ఆసన్నమైంది. వివాహా వేదిక ఇటలీలో ఫిక్స్ అయిందన్న సంగతి తెలిసిందే. మెగా, అల్లు కుటుంబాలు ఆల్రెడీ ఇటలీలో ల్యాండ్ అయ్యాయి. కొంత మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం ఇటలీకి పయనం అయ్యారు.

పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి ఈ పెళ్లికి వెళ్లారు. రేణూదేశాయ్ ఈ పెళ్లికి దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది. వరుణ్ తేజ్ పెళ్లి మీద రేణూదేశాయ్ స్పందించింది. తాను నిహారిక పెళ్లికి కూడా వెళ్లలేదని, పిల్లల్ని పంపించాను అని చెప్పుకొచ్చింది. వరుణ్ తేజ్ తన కళ్ల ముందు పెరిగాడని, అతనికి ఎప్పుడూ తన ఆశీస్సులుంటాయని, తాను పెళ్లికి వెళ్తే అందరికీ అన్ కంఫర్టబుల్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే ఈ సారి అకిరా, ఆద్యలు సైతం వరుణ్ తేజ్ పెళ్లికి వెళ్లడం లేదన్నట్టుగా కనిపిస్తోంది.

రేణూ దేశాయ్ ప్రస్తుతం ముంబైలో ఉంది. ముంబైలోని కాలీ పీలి ట్యాక్సీలు ఈ నెలాఖరు వరకు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వాటిని అక్కడి ప్రభుత్వం నిషేదించిన సంగతి తెలిసిందే. మొదటిసారిగా, చివరి సారిగా ఆద్యను కాలీ పీలి ట్యాక్సీని ఎక్కించింది రేణూ దేశాయ్. ముంబై వీధుల్లో తల్లీకూతుళ్లు ఇలా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో బాగానే వైరల్ అవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu