పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెస్తుంది. గతకొంత కాలంగా టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న రేణు రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్ నాగేశ్వరావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది రేణు దేశాయ్. వంశీ కృష్ణ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో హీరోయిన్గా నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు నటిస్తున్నారు.
షూటింగ్ శరవేంగా జరుగుతున్న ఈ సినిమాలో భాగమైనందుకు రేణు దేశాయ్ ఆనందం వ్యక్తం చేసింది. ‘హేమలత లవణం గారి లాంటి స్పూర్తిధాయకమైన పాత్రలో నేను చేయగలను అని నమ్మి నాకు అవకాశం ఇచ్చిన వంశీ కృష్ణకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు’ అని తెలిపారు. ఈ సినిమాలో రేణు దేశాయ్ హేమలత లవణం.. టైగర్ నాగేశ్వరావు పాత్రలో నటిస్తున్నారు.
https://www.instagram.com/reel/CipWht0Bs6B/?utm_source=ig_web_copy_link