నటి రేణు దేశాయ్ వెండి తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ‘జానీ’ సినిమా తర్వాత రేణు మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ లో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది.
ఇందులో రవితేజ సోదరి పాత్రలో ఆమె నటించనున్నట్టు సమాచారం. ఈ పాత్ర విషయమై ఇప్పటికే ఆమెతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. వంశీకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా రవితేజ కెరీర్లో ఈ సినిమా తొలి పాన్ ఇండియా చిత్రం కాబోతోంది. దీంతో ఈ సినిమాకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ ను ఎంపిక చేస్తున్నారు. ఈ వార్తల ప్రకారం రేణు దేశాయ్ ఈ చిత్రంలో నటిస్తే… కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది.