నటి, పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 11 ఏళ్ల కిందట పవన్ కల్యాణ్ నుంచి విడిపోయింది రేణూ దేశాయ్. కానీ పవన్ ప్యాన్స్ ఇప్పటికీ ఆమెను ‘వదిన’ అనే పిలుస్తుంటారు. కానీ చాలా మంది నెగటివ్ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా అకీరా నందన్ బర్త్ డే సందర్భంగా మరోసారి ఫ్యాన్స్ మాటలకు రేణూ దేశాయ్ మండిపడింది.
అకీరా పుట్టినరోజు సందర్భంగా అతడితో ఉన్న ఫోటోలను రేణూ పోస్టు చేయగా దానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్లు పెట్టారు. అందులో కొందరు మా అన్న కొడుకును చూడాలని ఉందని సరిగ్గా చూపించండని కామెంట్లు పెట్టారు. అయితే ఈ కామెంట్లపై రేణూ దేశాయ్ మండిపడింది.
అకీరా నా కొడుకు. మీరు ఒక తల్లికి పుట్టలేదా? మీరు పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ అభిమానులని నాకు తెలుసు. కానీ మాట్లాడే విధానం నేర్చుకోండి. నేను ఎన్ని సార్లు ఈ విషయాన్ని వదిలేయాలనుకున్నా మీరు నన్ను అవమానిస్తూనే ఉన్నారు అంటూ ఆగ్రహించింది. కనీసం అకిరా పుట్టిన రోజునాడైనా ప్రశాంతంగా ఉండనీయకుండా నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారెందుకు. 11 ఏళ్ల నుండి నేనిది భరిస్తున్నా కాని ఒక తల్లిగా ఇప్పుడు చాలా హర్ట్ అయ్యాను అని రేణూ పేర్కొంది.
తెలుగు స్టేట్స్ లో మీరు ఎవరి కొడుకు అంటే తండ్రి పేరే చెబుతారని ఓ అభిమాని కామెంట్ పెట్టగా.. దాని పైనా రేణూ దేశాయ్ సీరియస్ అయింది. ఆడ వాళ్లను అవమానపరచడం మన కల్చరా అని ప్రశ్నించింది. భారతీయ సాంప్రదాయం ప్రకారం మహిళలు ఎక్కువ విలువ గౌరవం ప్రాధానం ఇస్తారన్న విషయం తెలియదా అని నిలదీసింది.
సోషల్ యాక్టివిస్టు కృష్ణ కుమారి చేసిన కామెంట్స్ తాలుకూ వీడియోను కూడా రేణూ షేర్ చేసింది. అందులో కృష్ణ కుమారి సమాజం సమాజంలో కోణంలో మహిళలపై వివక్ష గురించి చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ‘పవన్ తో రేణూ దేశాయ్ సహజీవనం చేసి ఓ బిడ్డని కనేందుకు కూడా ముందుకొచ్చింది. అలాంటి వ్యక్తిని వదులుకునే అవకాశమే రాకూడదు. పవన్ కల్యాణ్ కి రేణూ దేశాయ్ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఆ రోజు రేణు ‘నా కొడుకు పుట్టింది సహజీవనం వల్ల కాదు.. పవన్ కల్యాణ్ నన్ను పెళ్లి చేసుకున్నారు’ అని ప్రకటన చేసి ఉంటే పవన్ కి జైలు శిక్ష పడేది’ అని చెప్పారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. తనను కూడా సపోర్ట్ చేసే వారు తనకు మద్దతుగా నిలిచే వారు ఉన్నారని కన్నీటిపర్యంతం అయినట్లు రాసుకొచ్చింది.
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు