పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడిగా అకీరా నందన్ హీరో ఎంట్రీ కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల అకీరా అమెరికాలోని ఫిల్మ్ స్కూల్లో చేరాడనగానే అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. కానీ, ఆ ఆనందం వారికి ఎక్కువ రోజులు మిగల్లేదు. అందుకు కారణం అకీరా తల్లి రేణూ దేశాయ్ వ్యాఖ్యలే.
అకీరాకు హీరో అవ్వాలని లేదని రేణు స్పష్టం చేశారు. “ఇప్పటివరకు అకీరా ఆలోచన ఇదే… అతడు హీరో కావాలని అనుకోవడంలేదు. ఇకముందు ఏం జరుగుతుందో చెప్పలేను. ఒకవేళ అకీరా హీరో అవ్వాలని అనుకుంటే ఆ విషయాన్ని నేనే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తాను” అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
తాను ఇన్ స్టాగ్రామ్ లో ఏ పోస్టు పెట్టినా, దాని గురించి ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నారని ఆరోపించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. అకీరా, తన మనవడు కార్తికేయ అమెరికాలోని ఓ ఫిల్మ్ స్కూల్లో చేరినట్టు వెల్లడించిన సంగతి తెలిసిందే.