HomeTelugu Trendingలవ్ ఫెయిల్యూర్ పై రేణూ దేశాయ్‌ కామెంట్స్‌

లవ్ ఫెయిల్యూర్ పై రేణూ దేశాయ్‌ కామెంట్స్‌

Renu desai comments about l
నటి రేణూ దేశాయ్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించింది. పలు ఆసక్తికరంగా ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ప్రేమలో విఫలమైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు.. ఎంతగానో ప్రేమించిన వ్యక్తి మన పక్కన లేడని, మనం మోసపోయామని అనిపించినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అయితే ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం తప్పు. నీ జీవితం, నీ ప్రాణం కంటే ఎవరు ముఖ్యం కాదు.

కౌన్సిలింగ్ తీసుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో సులభంగా ఆ బాధ నుంచి బయటపడొచ్చని రేణు సూచించారు. జీవితమంటేనే ఎన్నో ఆటుపోట్లు.. వాటన్నింటిని ఎదుర్కొంటూ ధైర్యంగా నిలబడాలి. మిమ్మల్ని మీరు నిరూపించుకుంటూ, మీకంటూ సొంత గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలని రేణు దేశాయ్ చెప్పుకొచ్చాంది. ఇక రేణు దేశాయ్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రేమించి పెళ్లి చేసుకోని విడిపోయిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu