బద్రి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రేణు దేశాయ్, ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని సినిమాలు చేసింది.. ఆ తరువాత ఆయననే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తరువాత వీరిద్దరూ విడిపోయారు. రేణు దేశాయ్ ప్రస్తుతం పూణే లో ఉంటోంది. అక్కడ ఫిలిం ప్రొడక్షన్ ను నిర్వహిస్తూ, షార్ట్ ఫిలిమ్స్, మరాఠీ సినిమాలు తీస్తున్నది.
అయితే, రేణు దేశాయ్ సడెన్ గా వికారాబాద్ లోని ఓ గ్రామంలో సందడి చేసింది. వికారాబాద్ మీదుగా రేణు హైదరాబాద్ వస్తుండగా ఆమె కారు టైరు పంచర్ కావడంతో వికారాబాద్ లోని గ్రామంలో ఆగింది. అక్కడ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.