పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కుమారుడు అకీరా నందన్ సినిమాల్లోకి రావడం తనకి ఇష్టంలేదని సంకేతాలిచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం అకీరా సినిమాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని రేణు అంటోంది. అకీరా తండ్రి పవన్ కళ్యాణ్, పెదనాన్న చిరంజీవి, అన్నయ్య రామ్ చరణ్ కాబట్టి నటన అతని రక్తంలోనే ఉంది. హీరో అవుతానంటే నేనేమీ అడ్డు చెప్పను, కానీ ఇప్పుడే కాదు. అతను తన బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. హీరో అయ్యే టైమ్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తాడు అంటూ తన అభిప్రాయాన్ని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానుల మనసులో ఉన్న కోరికల్లో ఆయన కుమారుడు అకీరా నందన్ ను హీరోగా చూడాలనేది కూడ ఒకటి.