సమంత, నాగచైతన్యల ప్రేమ వ్యవహారం ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. ప్రతి ఒక్కరికీ వీరి
ప్రేమ గురించి తెలుసు. అంతేకాదు ఇరు కుటుంబ సభ్యులు కూడా వీరి వివాహానికి సమ్మతించడంతో
ఈ జంట చాలా సంతోశంగా ఉంది. వచ్చే సంవత్సరంలో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది.
ఇది పాత విషయమే అయినా.. ఇందులో ఓ కొత్త పాయింట్ ఉంది. అదేమిటంటే.. సమంత
తన పెళ్లి చెన్నైలో, తన కుటుంబ ఆచారాల ప్రకారం జరగాలని ఆస పడుతోంది. ఆమె ఇష్టపడినట్లే..
అక్కడ పెళ్లి చేసి మరలా హైదరాబాద్ లో హిందూ సంప్రదాయాల ప్రకారం మరోసారి పెళ్లి
చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సమంత ప్రస్తుతం చెన్నైకి షిఫ్ట్ అయిందని సమాచారం.
అప్పుడప్పుడు పెళ్లి పనుల కోసం హైదరాబాద్ వస్తూ.. వెళ్తోందని అన్నపూర్ణ స్టూడియో వర్గాల
ద్వారా తెలుస్తోంది.