నటీనటులు: శివ కార్తికేయన్, కీర్తి సురేష్, శరణ్య, యోగిబాబు తదితరులు
సంగీతం: అనిరుధ్
సినిమాటోగ్రఫీ: పి.సి.శ్రీరామ్
ఎడిటింగ్: రుబెన్
నిర్మాత: దిల్ రాజు
దర్శకత్వం: బక్కియ రాజ్ కన్నన్
శివకార్తికేయన్, కీర్తిసురేష్ జంటగా బక్కియ రాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ ఎంటర్‌టైనర్
‘రెమో’. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యానర్‌పై ఆర్.డి.రాజా సమర్పణలో
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నవంబర్ 25 న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. తమిళంలో
ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. మరి తెలుగులో ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు
మెప్పించిందో.. సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం!
కథ:
ఎస్.కె(శివ కార్తికేయన్)కు చిన్నతనం నుండి హీరో అవ్వాలనేది కల. తన కల నెరవేర్చుకోవడానికి
రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బేసిక్ గా అమ్మాయిలకు చాలా దూరంగా ఉంటాడు ఎస్.కె.
అటువంటి తను రోడ్ మీద కావ్య(కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. తనను
ఫాలో అవుతూ ఉండే ఎస్.కె ఒకరోజు తన ప్రేమ విషయం చెప్పడానికి అమ్మాయి ఇంటికి వెళ్తాడు.
కానీ అక్కడ కావ్యకు విశ్వ అనే మరో అబ్బాయితో నిశ్చితార్ధం జరగడం చూసి తట్టుకోలేక
అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు సినిమాలో అవకాశం కోసం నర్స్ గెటప్ వేసుకొని
బస్ లో వెళ్తోన్న ఎస్.కె ను అమ్మయనుకొని మాట్లాడుతుంది కావ్య. దీంతో తన పేరు రెమో అని
పరిచయం చేసుకుంటాడు. కావ్య తను పని చేసే హాస్పిటల్ లో ఎస్.కె కు నర్స్ గా ఉద్యోగం కూడా
ఇప్పిస్తుంది. తన ప్రేమను దక్కించుకోవడానికి ఇదొక అవకాశం గా భావించిన ఎస్.కె ఆ తరువాత
ఏం చేశాడు…? కావ్య, ఎస్.కె ప్రేమలో పడుతుందా..? లేక పెళ్లి చేసుకొని వెళ్లిపోతుందా..? ఎస్.కె
తను కోరుకున్నట్లు హీరో అయ్యడా..? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ప్లస్ పాయింట్స్:
శివ కార్తికేయన్
కామెడీ
సంగీతం
ఫోటోగ్రఫీ
ఇంటర్వల్ బ్యాంగ్
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ ల్యాగ్
ఎడిటింగ్
రొటీన్ స్టోరీ
విశ్లేషణ:
ఒక అబ్బాయి, అమ్మాయిని ప్రేమించడం తన ప్రేమను గెలిపించుకోవడం కోసం రకరకాల
ప్రయత్నాలు చేయడం చేయడం.. ఇటువంటి కాన్సెప్ట్స్ తో ఇప్పటికే కొన్ని వందల సినిమాలు
వచ్చాయి. అయితే అదే కథను ఎంటర్టైనింగ్ గా రూపొందించి కొత్తగా ప్రెజంట్ చేశాడు దర్శకుడు
బక్కియ రాజ్ కన్నన్. దర్శకుడిగా తనకు మొదటి సినిమా అయినా.. చక్కటి ప్రేమ కథను
ఎన్నుకొని మంచి డెబ్యూ సినిమాతో ఎంటర్ అయ్యాడు. సినిమాలో డైలాగ్స్ యూత్ కు బాగా
కనెక్ట్ అవుతాయి. శివ కార్తికేయన్ ఎస్.కె పాత్రలో కంటే రెమో పాత్రలోనే ఇంకా అందంగా
కనిపించాడు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో ఒదిగిపోయి నటించాడు. హీరోకి, తన తల్లికి మధ్య
వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పిస్తాయి. ఇక డాక్టర్ పాత్రలో కీర్తి సురేష్ తనదైన
స్టయిల్ లో మెప్పించింది. అక్కడక్కడా తన నటనతో నవ్విస్తుంది కూడా. సినిమా రెండో భాగంలో
వచ్చే ఎమోషనల్ సీన్స్ లో ఆకట్టుకుంది. సినిమా మొత్తం హీరో, హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ
ఉంటుంది. ఈ సినిమాకు పెద్ద ప్లస్ సినిమాటోగ్రఫీ అనే చెప్పాలి. పి.సి.శ్రీరామ్ విజువల్స్ సినిమాకు
రిచ్ నెస్ తీసుకొచ్చాయి. ఇంటర్వల్ లో వచ్చే లైటింగ్ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
అనిరుధ్ అందించిన సంగీతం వినసోంపుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ ను ఎలివేట్
చేసింది. కథను కావాలని ల్యాగ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ లో చాలా వరకు
అనవసరపు సన్నివేశాలు ఉన్నాయి. వాటిని ఎడిట్ చేసి ఉంటే సినిమా ఇంకా బావుండేది.
మొత్తానికి అటు యూత్, ఇటు ఫ్యామిలీ అన్ని వర్గాల ప్రేక్షకులు చూడగలిగే చక్కటి క్లీన్ లవ్
స్టోరీ ‘రెమో’.