Prabhas Raja Saab update:
పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో భారీ చిత్రం రాజా సాబ్ ఈ సినిమా 2025 వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో మొత్తం ఆరు పాటలు ఉంటాయని, వాటిలో ఒకటి రీమిక్స్ సాంగ్ అని థమన్ స్వయంగా ప్రకటించారు.
ఇప్పుడీ రీమిక్స్ సాంగ్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ పాట కోసం ప్రభాస్ నటించిన సినిమాల్లోనో లేదా కృష్ణంరాజు నటించిన సినిమాల్లోనో ఓ పాటను రీమిక్స్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, దర్శకుడు మారుతి మాత్రం ఈ రీమిక్స్ సాంగ్‌ను హిందీ చిత్రానికి సంబంధించినదిగా ఉంచే ఆలోచనలో ఉన్నారు.
#TheRajaSaab లో ఆరు పాటలు ఉంటాయి, అందులో ఒకటి రీమేక్ పాట. ఈ పాటలు పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రానికి తగినవిగా ఉంటాయి.
జనవరి నుంచి పాటల అప్డేట్స్ మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. #Prabhas
– @MusicThaman pic.twitter.com/x7uF7w06oQ
— CHITRAMBHALARE (@chitrambhalareI) November 17, 2024
90 లలో సంచలనం సృష్టించిన ‘ఇన్సాఫ్ అప్పనే లహూ సే’ చిత్రంలోని ‘హవా హవా’ అనే పాటను రీమిక్స్ చేయాలని నిర్ణయించారట. ఈ పాట హిందీలో అప్పట్లో బాగా పాపులర్ అయింది. ఈ సాంగ్ కోసం నిర్మాతలు ఏకంగా రూ. 2 కోట్ల ఖర్చు చేశారు. ఈ పాటను ప్రభాస్ హీరోయిన్ మాళవిక మోహనన్‌తో అద్భుతంగా తెరకెక్కించేందుకు దర్శకుడు మారుతి ప్రత్యేక ప్లానింగ్ చేస్తున్నారు.
ఈ రీమిక్స్ సాంగ్ భారీ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్రబృందం నమ్మకంతో ఉంది. చాలా కాలం తర్వాత ఒక ఎంటర్టైనింగ్ పాత్రలో ప్రభాస్ నటిస్తుండటంతో ఈ చిత్రం మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మరి ఈ రీమిక్స్ సాంగ్ ఎలా ఉంటుందో, అది ప్రేక్షకులను ఎంతలా అలరిస్తుందో వేచి చూడాల్సిందే.
ALSO READ: Mokshagna Debut సినిమాలో విలన్ గా మరొక స్టార్ కిడ్?