HomeTelugu Trendingశిల్పాశెట్టి దంపతులకు సెబీ నుంచి ఊరట

శిల్పాశెట్టి దంపతులకు సెబీ నుంచి ఊరట

Shilpa Shetty sebi case
నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు సెబీ విచారణనుంచి ఊరట లభించింది. షేర్ హోల్డింగ్ వివరాలు వెల్లడిలో నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో వారిపై చర్యలు అవసరం లేదని, నిబంధనలకు లోబడే షేర్ హోల్డింగ్స్ ఉన్నాయని సెబీ అభిప్రాయపడింది. 2015 మార్చిలో 25.75 శాతం వాటా కొనుగోలు చేసి వియాన్‌ ఇండస్ట్రీస్‌ (గతంలో హిందుస్తాన్‌ సేఫ్టీ గ్లాస్‌ ఇండస్ట్రీస్‌)లో శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రా ప్రమోటర్లుగా మారారు.

ఆ తర్వాత కంపెనీ కొన్ని షేర్లను ప్రిఫరెన్షియల్‌ అలాట్‌మెంట్‌ కింద కేటాయించింది. ఈ విషయాన్ని నిబంధనలకు అనుగుణంగా వారు వెల్లడించలేదని ఆరోపణలు వచ్చాయి. 2013 సెప్టెంబర్‌ నుంచి 2015 డిసెంబర్‌ మధ్య కాలంలో వియాన్‌ ఇండస్ట్రీస్‌ షేర్ల లావాదేవీలపై సెబీ విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు తర్వాత కూడా శిల్పాశెట్టి, రాజ్‌ కుంద్రాల షేర్‌హోల్డింగ్‌ నిర్దిష్ట పరిమితికి లోబడే ఉందని, దీన్ని ప్రత్యేకంగా వెల్లడించాల్సిన అవసరం లేదని సెబీ అభిప్రాయపడింది. తదనుగుణంగా వారిపై ప్రారంభించిన చట్టపరమైన చర్యలను పక్కన పెడుతున్నట్లు పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu