ఐదేళ్లుగా నడుస్తున్న ఓ కోర్టు కేసు నుంచి మెగాస్టార్ చిరంజీవికి ఊరట లభించింది. ప్రజారాజ్యం పార్టీ ఎన్నికల ప్రచారం చేసే సయమంలో చిరంజీవిపై అప్పట్లో కేసు నమోదైంది. 2014 ఏప్రిల్ 27న నిర్దేశించిన సమయం దాటిపోయినా చిరంజీవి అర్థరాత్రి ప్రచారం చేశారని గుంటూరు అరండల్ పేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీనిపై చిరు ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం జరిగిన విచారణలో చిరు తరపు న్యాయవాది ప్రచారం ముగించుకుని వెళుతుంటే చిరంజీవిపై కావాలని ఈ తప్పుడు కేసును పెట్టారని వాదనలు వినిపించారు. వాదనలు విన్న జస్టిస్ రజని కేసును కొట్టివేశారు.