Homeతెలుగు Newsచంద్రబాబుకు ఊరట..రీకాల్‌ పిటిషన్‌కు అనుమతి

చంద్రబాబుకు ఊరట..రీకాల్‌ పిటిషన్‌కు అనుమతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ న్యాయస్థానంలో ఊరట లభించింది. తనపై జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ వెనక్కి తీసుకోవాలని(రీకాల్‌) అభ్యర్థిస్తూ చంద్రబాబు తరపున ఆయన న్యాయవాదులు రెండ్రోజుల క్రితం ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూత్రా, మరో న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపించారు.

5 10

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై బాబ్లీ ప్రాజెక్టును నిర్మిస్తే ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ఆందోళనపై నమోదైన కేసులో ధర్మాబాద్‌ న్యాయస్థానం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. 2010 జులై 17న నమోదైన ఈ కేసులో చంద్రబాబు సహా 16 మందికి న్యాయస్థానం నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసింది. ఈనెల 15న విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహా నిందితులంతా హాజరు కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం చంద్రబాబు రీకాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

‘ఈ కేసు వ్యవహారమై మీడియాలో వివరాలు వచ్చాకే నాపై ఎన్బీడబ్ల్యూ జారీ అయినట్లు తెలిసింది. రాజకీయ ప్రతీకారంతో కేసులో నన్ను ఇరికించారు. దీనికి సంబంధించి సమన్లు/నోటీసు/బెయిలబుల్‌ వారెంట్‌ నాకు అందలేదు. అభియోగపత్రం దాఖలయ్యాక కూడా కనీసం మొదటి నోటీసూ అందలేదు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు తీవ్రమైనవేమీ కావు. ఎన్బీడబ్ల్యూ ఉపసంహరించడానికి ఇది తగిన కేసు. ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన పలు తీర్పుల నేపథ్యంలో వారెంట్‌ రీకాల్‌ సమయంలో నిందితుడు న్యాయస్థానంలో హాజరు కావాల్సిన అవసరం లేదు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని 2018 జులై 05న జారీచేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను రీకాల్‌ చేయండి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిటీషన్‌లో కోరారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి రీకాల్‌ పిటిషన్‌ను అనుమతించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu