ఫ్యామిలీ లో అరడజనకు పైగా హీరోలుండడం,అంతా హిట్ మీద హిట్ కొడుతూ సినిమాలు చేస్తూ దూసుకుపోతుండడంతో వీళ్ళతో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలకు రిలీజ్ విషయంలో చాలా ప్రొబ్లెమ్స్ ఎదురవుతున్నాయి. ప్రస్తుతం పవన్,త్రివిక్రమ్ ల అజ్ఞాతవాసి,చెర్రీ,సుకుమార్ ల రంగస్థలం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే ఇప్పడు పవన్ 25 వ సినిమా సంక్రాంతికి షెడ్యూల్ కావడంతో బాబాయ్ మీద పోటీకి రావడం ఇష్టంలేని రామ్ చరణ్ తన సినిమాని సమ్మర్ కి షిఫ్ట్ చేసాడు. అయితే దీంతో కొత్త ఇబ్బంది వచ్చింది.వక్కంతం వంశి డైరెక్షన్ లో బన్నీ చేస్తున్న సినిమా కూడా సమ్మర్ లో, పైగా చెర్రీ అనుకున్న డేట్ లోనే షెడ్యూల్ అయి ఉంది.
దీంతో ఈ క్లాష్ ఎలా తప్పించాలో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు నిర్మాతలు. చెర్రీ సినిమా ఇంకా ఆలస్యం అయితే స్టేల్ కంటెంట్ గా మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ సినిమా షూటింగ్ ని నవంబర్ చివరికి పూర్తి చెయ్యమని తరువాత డేట్స్ ఇవ్వనని సుకుమార్ కి డెడ్ లైన్ కూడా సెట్ చేసాడు రామ్ చరణ్. సో,ఆ డేట్ కోసం ఇలా ఇద్దరు మెగా హీరోలు మధనపడుతుంటే అదే డేట్ పై ఫోకస్ పెట్టాడు మహేష్. కొరటాల డైరెక్షన్ లో మహేష్ చేస్తున్న భరత్ అను నేను రీసెంట్ గా వచ్చిన షెడ్యూల్ గ్యాప్ వల్ల ఒక వారం ఆలస్యంగా రిలీజ్ కాబోతుంది.
ఇలా మూడు పెద్ద సినిమాలు ఒకేరోజువస్తే ఆడియన్స్ కి పండగే కానీ ఆయా సినిమాల నిర్మాతలకు మాత్రం బ్యాండ్ పడిపోతుంది. మొన్నే ఆగస్టు 15 న జరిగిన అనవరసర యుద్ధం వల్ల మంచి విజయాన్ని అందుకోవాల్సిన సినిమాలు కూడా కలెక్షన్స్ పంచుకోవాల్సి వచ్చింది.మరి ఈ 200 కోట్లకు పైగా ఉన్న బిజనెస్ ని ఆ రోజు ఎలా డీల్ చేస్తారో ఏమో.