HomeTelugu Big StoriesOG విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడంటే?

Release date locked for Pawan Kalyan OG
Release date locked for Pawan Kalyan OG

OG Release Date:

పవన్ కళ్యాణ్ నటించిన OG మూవీ విడుదలపై ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో పాత్రలో నటిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా షూటింగ్ ఎప్పుడు ముగుస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎన్నాళ్లగానో వేచిచూస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి మార్షల్ ఆర్ట్స్ చేస్తూ వెండి తెరపై కనిపించబోతున్నారు. ఇటీవల ఎన్నికల వ్యస్తత వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ త్వరలో మొదలవుతుంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్‌ను వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తుంది. ఈ తేదీపై అధికారిక ప్రకటన రాకపోయినా.. అదే రోజున రామ్ చరణ్ పుట్టినరోజు కావడంతో అభిమానులు రెండు పండుగలు జరుపుకునే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల తేదీని ప్రకటిస్తారని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి, ప్రియాంక అరుల్ మోహన్ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన అప్‌డేట్స్ ఈ సినిమాపై మంచి అంచనాలు తీసుకొచ్చాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu