
Rekhachithram Telugu release date:
మలయాళంలో భారీ హిట్ సాధించిన ‘రేఖాచిత్రం’ (Rekhachithram) ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ ఇటీవల సోనీ లివ్ లో విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. జోఫిన్ టి చాకో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.
ఇప్పటికే సోనీ లివ్ లో మల్టీపుల్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా త్వరలో తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ లో ప్రత్యేకంగా విడుదల కానుంది. మార్చి 14, 2025న ‘రేఖాచిత్రం’ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రకటన తెలుగు ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమాలో మనోజ్ కె జయన్, సిద్ధిక్, జగదీశ్, సాయికుమార్, హరిష్రీ అశోకన్, ఇంద్రజిత్, నిశాంత్ సాగర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ముజీబ్ మజీద్ అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ‘కావ్య ఫిల్మ్ కంపెనీ’ మరియు ‘ఆన్ మెగా మీడియా’ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.
తెలుగు ప్రేక్షకులకు మాత్రమే ప్రత్యేకంగా ‘ఆహా’ లో విడుదల కావడం విశేషం. ఈ నిర్ణయం ద్వారా ‘రేఖాచిత్రం’ మరింత ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది. ఉత్కంఠభరిత కథనంతో రూపొందిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ లవర్స్ కు తప్పక నచ్చే సినిమా అవుతుంది.