హీరోయిన్లు వారికి అవకాశాలు తగ్గితే ఐటం గర్ల్స్ అవతారం ఎత్తడం మనం తెలిసిందే. ఇది ఒకప్పుడు సాదరణంగా మారిపోయింది. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూన్న.. ఎదో ఒక హీరో సినిమాలో ఐటమ్ సాంగ్స్ లో మెరుస్తున్నారు మన హీరోయిన్‌లు. తాజాగా రెజీనా కాసాండ్రా కూడా ఇలా ఐటం గర్ల్ అవతారం ఎత్తబోతుంది. మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ‘ఆచార్య’ సినిమాలో ఈ బ్యూటీ ఐటమ్ సాంగ్ చేస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఐటమ్ సాంగ్స్ లో నటించడం ఇష్టముండదని చెప్పుకొచ్చింది.
కానీ అక్కడున్నది మెగాస్టార్ చిరంజీవి కావడంతో వెంటనే ఒకే ఒప్పుసుకున్నాను అని అంటుంది. ఆరు రోజుల పాటు ఈ పాటను చిత్రీకరించినట్లుగా రెజీనా చెప్పుకొచ్చింది. ‘చిరంజీవి గారి డాన్స్ ను చూసి నేను ఇన్సిఫైర్ అయ్యాను. ఆయన ఒక గొప్ప డాన్సర్ ‘ అంది. చిరంజీవి తో ఛాన్స్ ఇచ్చినందుకు కొరటాలకు కృతజ్ఞతలు చెప్పింది రెజీనా .’ఆచార్య’ చిత్రం లో తాను చేసింది ఐటెమ్ సాంగ్ కాదని సెలబ్రేషన్ సాంగ్ అంటుంది. చిరంజీవి తన డాన్స్ ను పొగడటం చాలా ఆనందంగా ఉందని రెజీనా తెలిపింది.