రామ్ పోతినేని తాజా మూవీ ‘స్కంద’. దీనికి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ సినిమా రిలీజ్‌కు ముందే రికార్డ్ ధరకు అమ్ముడుపోయాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ మూవీకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకుంది.
రామ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న తొలి మూవీ. వినాయకచవతి కానుకగా సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు రూ.45 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం.
స్కంద శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. రామ్ కెరీర్లో అత్యధిక ధరకు ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా స్కంద నిలిచింది. ఇటీవల రిలీజైన ఈ మూవీ ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే యూట్యూబ్‌లో 25 మిలియన్లకు పైగా వ్యూస్‌ను రాబట్టింది.
స్కంద మూవీలో రామ్ సరసన శ్రీలీల హీరోయిన్. యాక్షన్ మాస్ అంశాలకు ఫ్యామిలీ ఎమోషన్స్ జోడిస్తూ దర్శకుడు బోయపాటి ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నాడు.
స్కంద మూవీతో హీరో రామ్ పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నాడు. ఈ సినిమాలో ఇంకా శ్రీకాంత్, గౌతమి, ప్రిన్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.