HomeTelugu TrendingAA22 బడ్జెట్ ఎంతో అసలు ఊహించలేరు

AA22 బడ్జెట్ ఎంతో అసలు ఊహించలేరు

Record breaking budget set for AA22
Record breaking budget set for AA22

AA22 Movie Budget:

పుష్ప 2, జవాన్ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ అట్లీతో కలసి ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇప్పటికి “AA22 X A6” అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత ఖర్చుతో తయారవుతున్న ప్రాజెక్ట్స్‌లో ఒకటిగా నిలవనుంది.

బాలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాకి అద్భుతమైన రూ.800 కోట్లకు పైగా బడ్జెట్‌ ను ఖర్చు చేస్తున్నారట. ఇందులో రూ.200 కోట్లు ప్రొడక్షన్ కోసం, రూ.250 కోట్లు మాత్రం కేవలం విజువల్ ఎఫెక్ట్స్‌ కోసమే అని వినిపిస్తోంది. ఇది చూసి రామ్ అయ్యా.. మన సినిమా స్కేలు అసలేంటంటే అర్థమవుతుంది!

ఈ సినిమాతో డైరెక్టర్ అట్లీ రెమ్యూనరేషన్ కూడా ట్రిపుల్ అయిపోయింది. జవాన్ సినిమాకు ఆయన తీసుకున్న రూ.30 కోట్ల రెమ్యూనరేషన్‌కి 233% ఎక్కువగా ఈ సినిమాలో ఆయనకి రూ.100 కోట్లు చెల్లిస్తున్నారట. ఇదేంటంటే.. బడ్జెట్ కూడా పెద్దదే, అట్లీ డిమాండ్ కూడా భారీగా పెరిగిపోయింది.

ఇక మన అల్లు అర్జున్ సంగతేంటంటే, ఆయన ఈ సినిమాకు రూ.175 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారని సమాచారం. అదితో పాటు 15% ప్రాఫిట్ షేర్ కూడా ఉందట. అంటే సినిమా సక్సెస్ అయితే బన్నీకి ఇంకో మోస్తరు సంపాదన లభిస్తుంది.

ఈ కాంబినేషన్‌ను చూసి ఫ్యాన్స్ అందరూ “ఈ సినిమా థియేటర్లలో విజువల్ ఫెస్టివల్ అవ్వబోతుందే” అనుకుంటున్నారు. జవాన్ స్టైల్ యాక్షన్, పుష్ప స్టైల్ మాస్ మసాలా కలిస్తే ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. అసలే భారీ బడ్జెట్… దానికి అదిరిపోయే కాంబినేషన్… ఇప్పుడు అందరి కళ్లూ ఈ ప్రాజెక్ట్ మీదే ఉన్నాయి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu