Mahesh Babu – Rajamouli movie budget:
తెలుగు సినిమా దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ప్రతి సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, భారీ బడ్జెట్‌లతో తన రికార్డులు తానే బ్రేక్ చేస్తున్నారు. “బాహుబలి పార్ట్ 1” చిత్రానికి సుమారు రూ. 200 కోట్ల బడ్జెట్ కేటాయించడం ద్వారా రాజమౌళి తొలిసారిగా తెలుగు సినిమా బడ్జెట్‌ను భారీ స్థాయికి చేర్చారు. ఆ తరువాత “బాహుబలి 2” కోసం రూ. 400 కోట్లను ఖర్చు చేయడం ద్వారా మరింత పెద్ద స్థాయి ప్రాజెక్ట్‌ను రూపొందించారు.
ఈ క్రమంలో ఆయన తర్వాత తీసిన “ఆర్ఆర్ఆర్” కూడా దాదాపు అదే స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. ఇటీవల, తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. “కల్కి 2898 ఏ.డి”, “పుష్ప 2” వంటి చిత్రాలు రూ. 500 కోట్లకు పైగా ఖర్చుతో రూపొందుతుండటంతో, ఈ రంగంలో కొత్త రికార్డులు నమోదు అవుతున్నాయి.
#SSMB29: Record-Breaking Budget in Indian Cinema!
👉 Superstar #MaheshBabu & #Rajamouli are teaming up for a groundbreaking project with a whopping 1000 Crore budget, setting a new benchmark in the industry.
👉 Production kicks off in January 2025—get ready for a cinematic… pic.twitter.com/0h773Hl7au
— KLAPBOARD (@klapboardpost) November 13, 2024
ఈ పోటీలో ముందుకు రావాలనే ఉద్దేశంతో రాజమౌళి తన తదుపరి ప్రాజెక్ట్‌కు మరింత భారీ బడ్జెట్‌ను కేటాయించాలని నిర్ణయించారు. తాజా సమాచారం ప్రకారం, రాజమౌళి తన కొత్త చిత్రానికి సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేశారు. ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో రికార్డు స్థాయిలో భారీ బడ్జెట్ అని చెప్పవచ్చు.
ఈ ప్రాజెక్ట్‌లో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించనుండగా, అతనితో పాటు దేశీయ, అంతర్జాతీయ స్థాయి నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో కేవలం నటీనటులకు, సాంకేతిక సిబ్బందికి మాత్రమే రూ. 400 నుంచి రూ. 500 కోట్లు ఖర్చు అవ్వనున్నాయి.
ప్రస్తుతం “SSMB29” అనే తాత్కాలిక పేరుతో ఉన్న ఈ ప్రాజెక్ట్ 2025 జనవరిలో ప్రారంభం కానుంది.
ALSO READ: మూడు నెలల తరువాత OTT లో విడుదల కాబోతున్న స్టార్ డైరెక్టర్ సినిమా