HomeTelugu Big StoriesMokshagna - Prashanth Varma సినిమా ఆఖరి నిమిషంలో ఆగిపోవడానికి కారణం ఏంటి?

Mokshagna – Prashanth Varma సినిమా ఆఖరి నిమిషంలో ఆగిపోవడానికి కారణం ఏంటి?

Reason why Mokshagna - Prashanth Varma's project got cancelled!
Reason why Mokshagna – Prashanth Varma’s project got cancelled!

Mokshagna – Prashanth Varma Movie Cancelled:

నందమూరి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తూ హను-మాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించారు. నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ఈ ప్రాజెక్ట్, మొదటి రెండు ఫోటోస్‌తో మరింత హైప్‌ను సంపాదించుకుంది. కానీ నిన్న ఉదయం జరగాల్సిన లాంచ్‌ను చివరి నిమిషంలో రద్దు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కోసం ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి రామానాయుడు స్టూడియోలో రూ. 30-40 లక్షల సెట్ను ఏర్పాటు చేశారు. రెండు పోస్టర్లను కూడా సిద్ధం చేశారు. కానీ, చివరి నిమిషంలో మోక్షజ్ఞ అస్వస్థతగా ఉన్నారని సమాచారం అందింది. బాలకృష్ణ స్వయంగా ప్రశాంత్ వర్మకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలిపారు.

మోక్షజ్ఞను నటన, డిక్షన్, నృత్యం, యాక్షన్ వంటి అంశాల్లో శిక్షణ కోసం విశాఖపట్నంలో సత్యానంద్ వద్ద, ఆ తర్వాత RP పట్నాయక్ వద్ద శిక్షణ పొందించారు. కానీ మోక్షజ్ఞకు సినిమాలపై పూర్తిగా ఆసక్తి లేకపోవడం, ఫ్యామిలీ ప్రెజర్ వల్ల ప్రాజెక్ట్ ఆగిపోయిందని భావిస్తున్నారు.

ప్రశాంత్ వర్మ ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఎమోషనల్‌గా పని చేశారు. బాలకృష్ణ అడగడం వల్ల ప్రాజెక్ట్ అంగీకరించిన ప్రశాంత్, ప్రీ-ప్రొడక్షన్, 3D మోడల్స్, CG పనులు కూడా ప్రారంభించారు. ఇలా ఉన్నపళంగా సినిమాను కేన్సిల్ చేయడంతో ప్రశాంత్ వర్మ తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇప్పుడు ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’, ప్రభాస్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై స్పష్టత రాగానే మళ్లీ పని ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

ALSO READ: NTR సెన్సేషన్: Prabhas కే చెక్ పెట్టిన రికార్డు!

Recent Articles English

Gallery

Recent Articles Telugu