Trolls on AR Rahman due to divorce:
సంగీత దిగ్గజం ఎ.ఆర్. రహమాన్ తన భార్య సైరా బాను విడాకుల వార్తను ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు. 1995లో పెళ్లి బంధంతో కలసిన ఈ జంటకు ముగ్గురు పిల్లలు – ఖతీజా, రహీమా, అమీన్ ఉన్నారు. 29 సంవత్సరాల అనుబంధం తర్వాత ఈ విడాకుల నిర్ణయం అనేక మందిని షాక్‌కు గురిచేసింది.
చాలా కాలం ప్రేమపూర్వకంగా ఉన్న జంట ఇప్పుడు పెద్ద షాక్ ఇచ్చారు. రహమాన్ తన సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను పంచుకున్నారు. ఆయన ప్రకటనలో “మేము 30 సంవత్సరాల మైలురాయిని చేరగలమని ఆశించాం. కానీ కొన్ని విషయాలకు అంతు ఉంటుంది. వీడిపోతున్న గుండెల భారం దేవుని సింహాసనాన్ని కూడా కంపింపజేస్తుంది. మా ప్రైవసీని గౌరవించి మీ మన్ననలు అందించినందుకు ధన్యవాదాలు. ఈ బాధాకరమైన దశలో మా వెంట నిలవండి. #arrsairaabreakup” అని పేర్కొన్నారు రెహ్మాన్.
AR Rahman and Saira Banu announce separation after 29 years of marriage. pic.twitter.com/1cQsOI64IQ
— LetsCinema (@letscinema) November 19, 2024
ఈ ప్రకటనలో #arrsairaabreakup హ్యాష్‌ట్యాగ్‌ను చేర్చడం పలువురి దృష్టిని ఆకర్షించింది. కొంతమంది దీన్ని విమర్శించారు. ప్రైవసీ అడుగుతూనే.. ఏదో పబ్లిసిటీ కావాలి అన్నట్టు రహమాన్ వంటి వ్యక్తి ఇలా హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించడం పట్ల కొందరు అసంతృప్తిని వ్యక్తం చేశారు.
“విడాకులకు హ్యాష్‌ట్యాగ్ అవసరమా?” అంటూ కామెంట్లు వచ్చాయి. సైరా బాను తరపు న్యాయవాది ప్రకటన ప్రకారం దంపతుల మధ్య భావోద్వేగ గ్యాప్ ఏర్పడి కలిసి ఉండడం కష్టమైంది అని అన్నారు.
ALSO READ: Prabhas ను ఈ విషయంలో దాటేసిన Pawan Kalyan.. రిపోర్ట్స్ ఏమంటున్నాయ్ అంటే!