HomeTelugu TrendingDevara సినిమా నుండి దావుడి పాట తీసేసింది ఎవరో తెలుసా?

Devara సినిమా నుండి దావుడి పాట తీసేసింది ఎవరో తెలుసా?

Reason why Daavudi song is not there in Devara
Reason why Daavudi song is not there in Devara

Devara Daavudi song:

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం దేవర: పార్ట్ 1 నిన్న అంటే సెప్టెంబర్ 27న విడుదలైంది. జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నది. కేవలం సినిమాలోని రెండో హాఫ్ లో మాత్రమే ఆమె కనిపిస్తారు.

మరోవైపు సినిమాలోని దావుడి అనే పాట ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద చిత్రీకరించబడింది. సినిమా మీద అంచనాలు పెరగడానికి ఈ పాట వీడియో కూడా చాలా ప్లస్ అయింది. ఈ పాట వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. అయితే ఈ సినిమాలో కాకుండా ఈ పాటని రోలింగ్ టైటిల్ సమయంలో వేస్తారని టాక్ కూడా వినిపించింది.

అయితే, ఈ పాటను చివరగా సినిమా నుండి తీసివేశారు. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ చూసిన తర్వాత ఎన్టీఆర్ వాటి వల్ల కథలో కొంత లాగ్ ఉందని భావించారట. దీంతో ఎన్టీఆర్ సుమారు 7 నిమిషాల ఫుటేజీని, అందులో దావుడి పాటను కూడా తీసివేశారట. దర్శకుడు కొరటాల శివ ఈ పాటను టైటిల్స్ రోలింగ్ సమయంలో పెట్టాలని అనుకున్నప్పటికీ, ఎన్టీఆర్ దానికి కూడా ఒప్పుకోలేదు.

జాన్వీ కపూర్ తన గ్లామర్ టచ్‌తో సినిమాలో మెరిసిపోయారు. దేవర మొదటి రోజు నుండే హౌస్‌ఫుల్ కలెక్షన్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంచనా. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ లు తమ పాత్రల్లో అద్భుతంగా నటించారని ప్రశంసలు అందుకుంటున్నారు. అనిరుధ్ ఇచ్చిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి సెపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చేసింది.

కానీ, కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండో హాఫ్ మీద కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. స్క్రీన్ ప్లే వేగం తగ్గడంతో ప్రేక్షకుల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. దేవర సినిమాలో మొదటి భాగం మాత్రం పూర్తి యాక్షన్, ఎమోషన్స్ తో ఆకట్టుకుంది. సినిమా బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది.

Read More: Devara హీరోయిన్ సినిమా ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేస్తోందా

Recent Articles English

Gallery

Recent Articles Telugu