HomeTelugu Big StoriesJr NTR అందుకే గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారా?

Jr NTR అందుకే గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారా?

Reason behind Jr NTR suddenly visiting temples
Reason behind Jr NTR suddenly visiting temples

Jr NTR ఇటీవల సడన్ గా కర్ణాటకలోని దేవాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఇంత సడన్ గా ఈ పర్యటనలు అందుకు అని ఫ్యాన్స్ ఆసక్తిగా ప్రశ్నిస్తున్నారు. అయితే దీని వెనుక కారణం ఆయన తల్లి జీవితకాల కోరికను నెరవేర్చడమే అని సమాచారం.

తాజాగా ఎన్టీఆర్, కన్నడ నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఉడుపి జిల్లాలోని కొల్లూరు శ్రీ ముకాంబికా ఆలయాన్ని సందర్శించారు. ఈ దేవాలయాన్ని సందర్శించేవారు ఆలయ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. పురుషులు ఇక్కడ షర్టులు, టీషర్టులు, షార్ట్ ప్యాంట్లు ధరించరాదు. అందుకే ఎన్టీఆర్ కూడా ఈ నియమాన్ని పాటించి, షర్ట్ లేకుండా పంచె ధరించి ఆలయ దర్శనానికి హాజరయ్యారు.

అయితే ఆసక్తికరంగా ఈ ఆలయ సందర్శనలు ఎన్టీఆర్ మొదటి సోలో ప్యాన్ ఇండియా సినిమా దేవర విడుదలకు కొన్ని వారాలు ముందు జరుగుతుండటం వల్ల ఫ్యాన్స్ అది సినిమాకోసం అని, ప్రమోషన్స్ కోసం అని అన్నారు. కానీ అసలు కారణం మాత్రం ఎన్టీఆర్ అమ్మగారే అని తెలుస్తోంది.

Jr NTR Devara:

ఇక దేవర సినిమా సంగతికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu