Homeపొలిటికల్Jagan Mohan Reddy భయం వెనుక కారణం అదేనా?

Jagan Mohan Reddy భయం వెనుక కారణం అదేనా?

Reason behind Jagan Mohan Reddy's refusal to sign the declaration
Reason behind Jagan Mohan Reddy’s refusal to sign the declaration

Jagan Mohan Reddy Tirumala Visit:

జగన్‌మోహన్ రెడ్డి ప్రస్తుతం తిరుమల లడ్డూ వ్యవహారంతో ఏర్పడిన నష్టాన్ని తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన రేపు తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకోబోతున్నారు. ఇది హిందువులకు ఆయనకి దేవుడిపై విశ్వాసం ఉందనే సంకేతం పంపేందుకు ప్రయత్నమని చెప్పుకోవచ్చు.

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్దేశించిన నిబంధనల ప్రకారం, హిందువేతరులు ఆలయ ప్రవేశానికి ముందు ఒక డిక్లరేషన్ (ప్రకటన) పై సంతకం చేయాలి. అందులో వారు దేవుడిపై విశ్వాసం ఉన్నప్పటికీ, ఇతర మతానికి చెందినవారని వెల్లడించాలి. అయితే, జగన్ ఆ ప్రకటనపై సంతకం చేయడానికి చాలా కాలంగా నిరాకరిస్తున్నారు. ఈ విషయం ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది.

గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ ఈ ప్రకటన పట్ల ప్రాముఖ్యత ఇవ్వలేదు. కానీ ఈసారి పరిస్థితి వేరుగా ఉంది. స్వామివారి పట్ల కొన్ని తీవ్రమైన తప్పులు జరిగాయని భావిస్తూ ప్రజలు ఈ సారి జగన్ ప్రకటనపై సంతకం చేయాలని గట్టిగా కోరుతున్నారు.

జగన్ స్వయంగా దేవుడిపై విశ్వాసం ఉందని చెబుతున్నారు. మరి ఆ ప్రకటనపై సంతకం చేయడంలో ఏం ఇబ్బంది అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ తనను క్రైస్తవుడిగా ప్రకటించడం వల్ల SC ఓటు బ్యాంక్ పోయే భయం ఉన్నట్టుగా కనిపిస్తుంది, అలాగే దేవాలయాలకు వెళ్ళడం ద్వారా హిందు ఓటర్లను ఆకర్షించాలనే వ్యూహం కూడా జగన్ ప్లాన్ లో భాగమే.

క్రైస్తవులలో ఒక వర్గం చాలా కఠినంగా ఉంటారు, ఇతర దేవుళ్ల ప్రసాదం కూడా తీసుకోరు. ఆ వర్గం జగన్‌కు బలమైన ఓటు బ్యాంక్. వారి మనోభావాలు దెబ్బతినకుండా చూడాలన్న ఉద్దేశంతో జగన్ ప్రకటనపై సంతకం చేయటానికి వెనకాడుతున్నారు. అదే సమయంలో, ఆ ప్రకటనపై సంతకం చేయడం వల్ల హిందు ఓటర్లపై దెబ్బ పడవచ్చని ఆయన భావిస్తున్నారు.

ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కూడా తిరుమలలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఏదేమైనా మాజీ ముఖమంత్రి Jagan Mohan Reddy nundi ఇలాంటి విలువలు ఆశించడం కూడా ప్రజల మూర్ఖత్వమే అవుతుంది.

Read More: Tirumala Laddu Controversy: అసలు ఏం జరిగింది? దీని వెనుక ఎవరి హస్తం ఉంది?

Recent Articles English

Gallery

Recent Articles Telugu