
ChaySo Engagement:
నాగచైతన్య శోభిత ధూళిపాల నిశ్చితార్థం ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ గా మారింది. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్కడ చూసినా వీళ్ళిద్దరి ఫోటోలే కనిపిస్తున్నాయి. బయటకి మాటలు వినిపించకపోయినా.. ఇండస్ట్రీ మొత్తం ఇదే టాపిక్ గురించి చర్చ నడుస్తూ ఉంది.
కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే.. ఒక్క సెలబ్రిటీ కూడా వీరి నిశ్చితార్థం గురించి కామెంట్లు చేయకపోవడం. ఎవరైనా సెలబ్రిటీ పెళ్లి చేసుకుంటున్నారు అంటే.. సోషల్ మీడియాలో పోస్ట్ పడగానే ఆ పోస్టు కింద బోలెడు శుభాకాంక్షలు కామెంట్లు కనిపిస్తాయి. పైగా నాగచైతన్య చిన్న హీరో కూడా కాదు. ఆఖరికి అక్కినేని కుటుంబంలోనే బోలెడంత మంది హీరోలు ఉన్నారు.
అందులో ఒకరు కూడా నాగచైతన్య కి శుభాకాంక్షలు చెప్పలేదు. హీరో సుశాంత్ ఒక్కడే ఇన్స్టా లో వాళ్ళ ఫోటో పెట్టి శుభాకాంక్షలు చెబుతూ ఒక స్టోరీ పెట్టారు. ఆఖరికి నాగచైతన్యకి ఎంతో క్లోజ్ అయిన రానా దగ్గుబాటి, సొంత తమ్ముడైన అక్కినేని అఖిల్ కూడా దీని గురించి నోరు విప్పలేదు. ఎంత రెండవ పెళ్లి అయినప్పటికీ కనీసం ఒకరు కూడా శుభాకాంక్షలు చెప్పకపోవడం హాట్ టాపిక్ గా మారింది.
దీని వెనుక ఒకే ఒక్క కారణం నాగచైతన్య మొదటి భార్య సమంత కూడా ఇండస్ట్రీలో మనిషే. నాగచైతన్య మనవాడే కదా అంటూ శుభాకాంక్షలు చెబితే.. సమంత ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. అది వారి సినిమాల మీద ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. అందుకే రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక చాలామంది సెలబ్రిటీలు మౌనంగానే ఉండిపోయారు.
పైగా నాగచైతన్యతో క్లోజ్ గా ఉండే చాలామంది సెలబ్రిటీలు సమంతతో కూడా అంతే క్లోజ్ గా ఉంటారు. ఉదాహరణకి విడాకుల తర్వాత కూడా అఖిల్ ను సమంత సోషల్ మీడియాలో ఫాలో అవుతూనే ఉంది. రానా కూడా సమంతను ఫాలో అవుతూనే ఉన్నారు. కాబట్టి వీళ్ళ మధ్య రిలేషన్ చెడిపోలేదని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఈ సందర్భంలో వాళ్లు నాగచైతన్యకి మద్దతుగా పోస్టులు పెడితే ఆమెకి ఇబ్బందిగా ఉండచ్చు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు సైలెంట్ అయి ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు.