HomeTelugu Trendingహై కోర్టును ఆశ్రయించిన Allu Arjun.. ఎందుకో తెలుసా?

హై కోర్టును ఆశ్రయించిన Allu Arjun.. ఎందుకో తెలుసా?

Reason behind Allu Arjun approaching High Court
Reason behind Allu Arjun approaching High Court

Allu Arjun Nandyal Case:

అల్లు అర్జున్ 2024 ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి కి మద్దతు తెలపడానికి నంద్యాల వెళ్లిన సమయంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసును రద్దు చేయాలన్న అభ్యర్థనతో అల్లు అర్జున్ సోమవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

2024 మే నెలలో ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు అల్లు అర్జున్ నంద్యాల లో శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి కి మద్దతు తెలపడానికి పెద్ద ర్యాలీ లో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయి.

ఈ సమయంలో పెద్దగా ప్రజలు గుమిగూడటం లేదా ర్యాలీలు నిర్వహించడం నిషేధం. అల్లు అర్జున్ ముందుగానే అనుమతి తీసుకోకుండా ర్యాలీలో పాల్గొనడం వల్ల ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై కేసు నమోదైంది.

నంద్యాల గ్రామీణ తహసీల్దార్ పి. రామచంద్ర రావు ఈ కేసు నమోదు చేశారు. అతను తన నివేదికలో, ర్యాలీ సమయంలో భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారని, దీనివల్ల ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘించబడిందని పేర్కొన్నారు. ఈ కేసు అల్లు అర్జున్ కి ఇబ్బందికరంగా మారింది.

కేసు నుండి విముక్తి కోసం, అల్లు అర్జున్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ఆయన తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. సోమవారం నాడు కోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించి, మంగళవారం విచారణకు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ కేసు ప్రజల్లో చాలా చర్చనీయాంశంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu